భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ ద్వారా వెల్లడించారు. భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ భారత్ విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని చెప్పారు.
Also Read: IPL 2025: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. షార్ట్‌లిస్ట్‌లో ఉప్పల్ స్టేడియం!
‘కాల్పుల విరమణకు భారత్-పాకిస్తాన్ అంగీకరించాయి. ఈరోజు సాయత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య తదుపరి చర్చలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం 3.35కి భారత్ డీజీఎంఓకి పాకిస్తాన్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరింది. చర్చల అనంతరం కాల్పుల విరమణకు అంగీకారం తెలిపారు. సాయత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణపై ఇరు దేశాల సైన్యానికి ఆదేశాలు జారీ అయ్యాయి’ అని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. మరోవైపు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాం అని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా ధ్రువీకరించారు.
