Diamer Bhasha Dam: పాకిస్థాన్ తన దేశంలో ఉన్న అపారమైన నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే నీటికి కటకటలాడే పరిస్థితులు తలెత్తవు. ఈ నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకుంటే చౌకైన విద్యుత్ ఉత్పత్తి, బంజరు భూములను సాగు భూములుగా మార్చడం జరిగేవి. సరైన నీటి వనరులు ఉన్నప్పటి కూడా వాటి నిర్వహణలో పాకిస్థాన్ నిర్లక్ష్య విధానం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. తాజాగా పాక్ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని సింధు నదిపై నిర్మించనున్న డైమర్-భాషా ఆనకట్ట దేశంలో నీటి సమస్యను తీర్చడంలో ఆశాకిరణంగా మారింది. కానీ ఈ ఆనకట్ట పనుల పురోగతికి అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అది ఏ విధంగా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా?
స్థానికుల నుంచి నిరసనలు..
కోహిస్తాన్‌లోని హర్బన్ అనే గ్రామస్థులు డైమర్-భాషా ఆనకట్ట నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆనకట్ట కోసం సేకరించిన భూమికి పరిహారం, స్థానిక ప్రజలకు పునరావాసంపై నిరసనలు వెల్లువెత్తున్నాయి. గత వారం రోజులుగా హర్బన్ గ్రామస్థులు గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఖైబర్-పఖ్తుంఖ్వాకు అనుసంధానించే హర్బన్ నాలా వద్ద కారకోరం హైవేను దిగ్బంధించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. రహదారి దిగ్బంధంతో వందలాది ట్రక్కులు, ప్రయాణీకుల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాణిజ్యం, ప్రజల ప్రయాణం పూర్తిగా నిలిచిపోయాయి. ఈసందర్భంగా నిరసనకారుల నాయకుడు నియామత్ ఖాన్ మాట్లాడుతూ.. తమ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు, పరిహారం చెల్లించడానికి ఆలస్యం చేశారని విమర్శించారు. చెల్లింపు హామీలను నెరవేర్చడంలో వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ (WAPDA), ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విఫలమయ్యాయని నిరసనకారులు విమర్శించారు. పలు నివేదికల ప్రకారం.. భూ యజమానులకు దాదాపు PKR 3 బిలియన్లు బాకీ ఉన్నారు. ఇందులో దాదాపు PKR 2 బిలియన్లు ఇప్పటికే కోహిస్థాన్ డిప్యూటీ కమిషనర్ ఖాతాలో జమ చేశారు. మిగిలిన మొత్తం అవసరమైన చట్టపరమైన లాంఛనాల కారణంగా పెండింగ్‌లో ఉందని అధికారులు తెలిపారు. నిరసనకారులు ఈ వివరణలను తిరస్కరించారు. సంవత్సరాలుగా జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
2020లో ప్రారంభం అయిన పనులు..
2020లో గత ప్రభుత్వ హయాంలో ఈ ఆనకట్ట నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అయితే పాక్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అనే ముఖ్యమైన అంశాన్ని పరిష్కరించకుండా త్వరితంగా నిర్మాణాన్ని ప్రారంభించాలనే నిర్ణయం తీవ్రమైన సవాళ్లకు దారితీసింది. ఆనకట్ట ఖర్చును మొదట్లో రూ.479 బిలియన్లుగా అంచనా వేశారు. ఇందులో రూ.120 బిలియన్లు భూసేకరణకు మాత్రమే కేటాయించారు. నేడు ఆ ఖర్చు రూ.1,400 బిలియన్లకు పెరిగింది. ఈ ఖర్చుల పెరుగుదల పేలవమైన ప్రణాళిక, విస్తృత నమూనాను ప్రతిబింబిస్తుందని, జాప్యం, అనవసరమైన అధికార అడ్డంకులు, ఇతర కారణాలు ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచాయని చెబుతున్నారు.
ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న భారత్..
ఈ ఆనకట్టను భారతదేశంలోని ఒక ప్రాంతమైన గిల్గిట్-బాల్టిస్థాన్‌లో నిర్మిస్తున్న కారణంగా దీనిని భారతదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. గిల్గిట్-బాల్టిస్థాన్ పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భాగం. నిర్మాణ పనులను కొనసాగించాలనే పాకిస్థాన్ నిర్ణయం భారతదేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని న్యూఢిల్లీ పదే పదే చెబుతోంది.
READ ALSO: Telusu Kada: ‘తెలుసు కదా’ ముగించేసిన సిద్దు
