Site icon NTV Telugu

India New Airline Rules: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్..

Indian Airlines

Indian Airlines

India New Airline Rules: దేశంలోని విమాన ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ దక్కనుంది. విమానంలో సీటు సెలక్షన్ కోసం అదనపు ఛార్జీలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రయాణికుల హక్కులను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ కొత్త నియమాల ప్రకారం.. విమానంలో కనీసం 60% సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు అందించాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ 60 శాతం సీట్లు ప్రయాణికులే ఎంపిక చేసుకునేలా ఆదేశాలిచ్చింది. ఇక ఒకే బుకింగ్ సంఖ్యతో ప్రయాణిస్తున్న వారిని ఒకే దగ్గర సీట్లలో కూర్చోబెట్టేలా కూడా సంస్థలు చర్యలు తీసుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులు లేదా ఒక గ్రూప్‌గా ప్రయాణించే వారు పక్కపక్కనే కూర్చోవాలంటే ఇప్పటివరకు అదనపు చార్జీలు చెల్లించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం ప్రయాణికులు ఒకే బుకింగ్‌తో ఉంటే వీలైనంత వరకు సమీప సీట్లలోనే కూర్చోబెట్టాలని ఆదేశించారు.

READ MORE: RGV Reviews: ధురంధర్-2’పై రామ్‌గోపాల్ వర్మ క్రేజీ రివ్యూ.. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్లకు కీలక సలహా!

ఇంతే కాదు.. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని సదుపాలపై పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కు సూచనలు చేసింది. క్రీడాకారులు, కళాకారులకు గతంలో వచ్చిన ఇబ్బందులపై స్పందిస్తూ.. క్రీడా సామగ్రి, సంగీత వాద్యాలు వంటి వస్తువులను విమానాల్లో తీసుకెళ్లే విషయంలో స్పష్టమైన విధానం ఉండాలని సూచించింది. భద్రతా నిబంధనలను పాటిస్తూనే మరోవైపు.. ప్రయాణికుల సౌకర్యాలకు ఏ మాత్రం భంగం కలిగించవద్దని స్పష్టం చేసింది. ఇక చాలా మంది కొన్ని పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లాని భావిస్తారు. ఈ పెంపుడు జంతువులను విమానాల్లో తీసుకెళ్లే విధానం ఇప్పటికీ సరిగ్గా లేదు. ఈ అంశంపై కూడా స్పష్టత ఇవ్వాలని సంస్థలను కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. విమాన ప్రయాణికుల హక్కుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విమాన ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికులకు ఉన్న హక్కులను సంస్థలు తప్పనిసరిగా పాటించాలి. ఈ హక్కులను తమ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, టికెట్ బుకింగ్ వేదికలు, విమానాశ్రయ కౌంటర్లలో స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

READ MORE: Dhurandhar2 : ధురంధర్ 2’ తెలుగు ప్రీమియర్స్ రద్దు.. బుకింగ్స్ ఆపేసిన ‘PVR INOX’

Exit mobile version