Site icon NTV Telugu

Muslim Population: సంచలన రిపోర్ట్..! 2060 నాటికి ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా భారత్..?

Muslims

Muslims

Muslim Population: భారతదేశంలో ముస్లిం జనాభా పెరుగుతోంది. ఇదే సమయంలో హిందూ జనాభా తగ్గుతూ వస్తోంది. ఈ విషయం ఊరకే చెప్పట్లేదు. ఇది లెక్కలు చెబుతున్న వాస్తవాలు. ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన అధ్యయంలో ఈ విషయం వెల్లడైంది. ముస్లిం జనాభా పెరుగుదలకు కారణాలు అనేకం ఉండొచ్చు. ఈ పెరుగుదల మాత్రం ఆందోళన కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా కలిగిన మొదటి దేశంగా ఇండోనేషియా ఉంది. అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. 2015 గణాంకాల ప్రకారం ఇండోనేషియాలో 87.1 శాతం ముస్లింలు ఉండగా, భారతదేశంలో 14.9 శాతం ఉన్నారు. అయితే, 2060 నాటికి భారతదేశంలో ముస్లింల సంఖ్య పెరిగి మొదటి స్థానానికి చేరుకుంటుందని, పాకిస్థాన్ రెండవ స్థానంలో ఉంటుందని ప్యూ రిసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం ముస్లిం జనాభాలో 11.1 శాతం భారతదేశంలో ఉన్నారు. ఇండోనేషియాలో 12.6 శాతం, పాకిస్థాన్‌లో 10.5 శాతం ఉన్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ (ఓఐసీ) అనేది ఇస్లామిక్ దేశాల సంఘటిత సంస్థ. ఇందులో 57 సభ్య దేశాలు ఉన్నాయి. అయితే.. ఈ నివేదిక 2022లోనే విడుదలైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముస్లిం జనాభా పెరుగుదలపై ఇటీవల స్పందించారు. ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

READ MORE: Maithili Thakur: బీజేపీలోకి మైథిలి ఠాకూర్, బీహార్ ఎన్నికల్లో పోటీ.. ఈమెకు ఇంత క్రేజ్ ఎలా.?

దేశంలో కొన్ని ప్రాంతాల్లో ముస్లిం జనాభా పెరుగుదలకు చొరబాట్లే ప్రధాన కారణమన్నారు. చొరబాట్లను కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నాయని ఆరోపించారు. “చొరబాటు అనేది కేవలం రాజకీయ అంశం కాదు. ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా పరిణమించిన ఒక జాతీయ సమస్య. 2011 జనాభా లెక్కల ప్రకారం, అస్సాంలో ముస్లిం జనాభా పదేళ్లలో 29.6 శాతం మేర వృద్ధి చెందింది. చొరబాటు లేకుండా ఈ స్థాయిలో వృద్ధి జరగడం అసాధ్యం. అలాగే పశ్చిమ బెంగాల్‌లోని అనేక జిల్లాల్లో ముస్లిం జనాభా వృద్ధి రేటు 40 శాతం వరకు ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో అయితే అది 70 శాతం వరకు చేరుకుంది. గతంలో చొరబాట్లు జరిగాయనేదానికి ఇది అసలైన నిదర్శనం.” అని ఆందోళనకర అంశాన్ని అమిత్ షా పంచుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

READ MORE: Cough Syrup Tragedy: దగ్గు సిరప్ కేసులో సంచలన నిజాలు.. కమీషన్‌కి కక్కుర్తి పడ్డ వైద్యుడు..!

Exit mobile version