Site icon NTV Telugu

India Missiles 2025: భారత క్షిపణుల ముందు పాక్ అస్త్ర సన్యాసం చేయాల్సిందే..

India Missiles 2025

India Missiles 2025

India Missiles 2025: దాయది దేశం పాకిస్థాన్ ఎన్ని కొత్త క్షిపణులు కొనుగోలు చేసిన అవి భారత అమ్ముల పొదిలో ఉన్న అత్యున్నత క్షిపణులతో పోల్చితే చాలా వెనకబడి ఉంటాయని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. తాగా పాక్ AIM-120 AMRAAM, చైనీస్ PL-15 వంటి కొత్త క్షిపణులను కొనుగోలు చేస్తోంది. అయితే వీటితో పోల్చితే భారతదేశ క్షిపణులు చాలా ఉన్నతమైనవిగా నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి. DRDO VSHORAD, Astra, Rudram, NRSAM, BrahMos-ER వంటి క్షిపణులు పరిధి, వేగం, కచ్చితత్వంలో పాక్ క్షిపణులతో కంటే చాలా చాలా మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. మే, 2025 లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తలెత్తిన ఘర్షణ సమయంలో మన దేశం.. పాక్ ప్రయోగించిన క్షిపణులను సులభంగా తప్పించుకుంది.

READ ALSO: Sai Sudharsan Catch: సాయి సుదర్శన్‌ సూపర్ క్యాచ్.. దెబ్బ గట్టిగా తాకినా వదలలేదు!

పాక్ క్షిపణులపై భారత క్షిపణుల ఆధిపత్యం..
పాకిస్థాన్ PL-15 (200 కి.మీ)తో అస్ట్రా Mk-2 తో పోటీ పడుతోంది. కానీ PL-15తో పోల్చితే భారతదేశం అస్త్ర ఎక్కువ శక్తివంతమైనదిగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పాక్ రాద్ (350 కి.మీ) రుద్రం కంటే పొడవుగా ఉంది. కానీ రుద్రం కచ్చితత్వం రాద్ కంటే మెరుగ్గా ఉంది. బాబర్ బ్రహ్మోస్-ER కంటే చిన్నది. మొత్తంమీద భారతదేశం క్షిపణుల పరిధి (800 కి.మీ+), వేగం (5000 కి.మీ/గం), అలాగే ఇవన్నీ స్వదేశీ సాంకేతికతలో తయారు చేసినవి. 2025 పూర్తి ఏడాది నాటికి భారతదేశం క్షిపణి సామర్థ్యం పాక్ కంటే రెండు రెట్లు బలంగా ఉంటుందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

భారత అమ్ముల పొదిలో ఉన్న అజేయమైన క్షిపణులు..

1. VSHORAD (వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ ): తక్కువ ఎత్తులో ఉన్న శత్రువులకు చుక్కలు చూపెట్టే క్షిపణి. VSHORAD అనేది భారతదేశం మ్యాన్-పోర్టబుల్ క్షిపణి. ఇది డ్రోన్లు, హెలికాప్టర్లు లేదా తక్కువ ఎత్తులో ఎగురుతున్న విమానాలను కూల్చివేసి, వాటిని ధ్వంసం చేయగలదు. పాక్ ప్రయోగించే చిన్న డ్రోన్లు లేదా హెలికాప్టర్ దాడులను అడ్డగించడానికి ఈ క్షిపణి చాలా అనువైనదని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి.

పరిధి: 6 కిలోమీటర్లు
వేగం: గంటకు 2470 కి.మీ.
బరువు: 17 కిలోలు
మార్గదర్శకత్వం: ఇన్‌ఫ్రారెడ్ ఇమేజర్
ప్లాట్‌ఫామ్: భుజం నుంచి లాంచ్ చేసే విధంగా, ట్రక్ లేదా హెలికాప్టర్ కూడా ప్రయోగించవచ్చు.

పాక్ వద్ద ఉన్న అంజా క్షిపణి కంటే చాలా మెరుగైనది (4 కి.మీ పరిధి). VSHORAD 2025లో సైన్యం చేతికి వచ్చింది. వచ్చిన వెంటనే ఈ క్షిపణులను భద్రత దళాలు సరిహద్దు వెంబడి మోహరించారు.

2. అస్త్ర: అస్ట్రా అనేది భారతదేశం స్వదేశీ BVRAM (బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి). ఈ క్షిపణి ప్రత్యేకత ఏమిటంటే ఇది.. పాక్ జెట్‌లను గాల్లోనే ఓడిస్తుందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఇది Mk-1 సేవలో ఉంది. Mk-2 2025లో పరీక్షించారు. ఈ క్షిపణి 200 కి.మీ పరిధి నుంచి పాకిస్థానీ JF-17 జెట్‌లను కూల్చగలదు.

పరిధి: Mk-1: 110 కి.మీ; Mk-2: 200 కి.మీ
వేగం: గంటకు 4939 కి.మీ.
బరువు: 154 కిలోలు
మార్గదర్శకత్వం: యాక్టివ్ రాడార్ + GPS (ఆటోమేటిక్ టార్గెట్ లాక్)
ప్లాట్‌ఫామ్‌లు: సుఖోయ్-30, తేజస్, మిగ్-29

పాక్ PL-15 (200 కి.మీ) తో భారత అస్త్ర పోటీపడుతుంది. పాక్ క్షిపణితో పోల్చితే అస్ట్రా మెరుగైన కచ్చితత్వం, తక్కువ ఖర్చు ($1 మిలియన్) కలిగి ఉంది. 2025 నాటికి 200 Mk-2 పరీక్షలు విజయవంతమయ్యాయి.

3. రుద్రం: ఈ క్షిపణి భూమిపై ఉన్న లక్ష్యాలను నాశనం చేస్తుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. రుద్రం అనేది గాలి నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణి. ఇది శత్రువుల రాడార్, విమానాశ్రయాలు లేదా బంకర్లను నాశనం చేస్తుంది. ఇప్పటికే రుద్రం-1 సేవలో ఉంది, 2025లో రుద్రం-3 హైపర్‌సోనిక్ వెర్షన్ ప్రయోగాల్లో ఉంది. వీటితో పాకిస్థాన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.

పరిధి: 150-250 కి.మీ
వేగం: గంటకు 2470 కి.మీ.
బరువు: 700 కిలోలు
మార్గదర్శకత్వం: నిష్క్రియాత్మక రాడార్ + GPS (రాడార్ సిగ్నల్‌ను అనుసరిస్తోంది)
ప్లాట్‌ఫామ్: సుఖోయ్-30, తేజస్

పాకిస్థాన్ రాద్ (350 కి.మీ) కంటే భారత రుద్రం తక్కువ దూరం ప్రయాణిస్తుంది, కానీ రుద్రం చొచ్చుకుపోయే వార్‌హెడ్ కఠినమైన లక్ష్యాలను, రాద్ కంటే ఎక్కువగా నాశనం చేస్తుంది. 2025లో రుద్రం-3 7408 కి.మీ/గం వేగ పరీక్ష నిర్వహించారు.

4. NRSAM (నావల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్) : ఈ క్షిపణి నేవీ స్వల్ప శ్రేణి కవచంగా రక్షణ వర్గాలు అభివర్ణించాయి. NRSAM నావికాదళ నౌకల కోసం రూపొందించినది. ఇది హార్పూన్ వంటి యాంటీ-షిప్ క్షిపణులను అడ్డుకుంటుంది. ఇది సముద్రంలో పాకిస్థాన్ నేవీని ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా తయారు చేశారు.

పరిధి: 15-25 కి.మీ.
వేగం: గంటకు 3087 కి.మీ.
బరువు: 250 కిలోలు
మార్గదర్శకత్వం: యాక్టివ్ రాడార్
వేదికలు: ఓడలు, జలాంతర్గాములు

పాకిస్థాన్ LY-80 (40 కి.మీ) కంటే చిన్నది. కానీ LY-80 కంటే NRSAM వేగవంతమైన ప్రతిచర్య, మెరుగైన కచ్చితత్వాన్ని కలిగి ఉంది. ఈ క్షిపణి 2025లో నావికాదళంలో చేర్చారు.

5. బ్రహ్మోస్-ER: సూపర్‌సోనిక్ క్రూయిజ్ రారాజుగా బ్రహ్మోస్-ER క్షిపణి ప్రత్యేకత సొంతం చేసుకుంది. బ్రహ్మోస్-ఈఆర్ (ఎక్స్‌టెండెడ్ రేంజ్) అనేది ఇండో-రష్యన్ సంయుక్త క్షిపణి. దీనిని భూమి, గాలి లేదా సముద్రం నుంచి ప్రయోగించవచ్చు. ఇది పాకిస్థాన్ నౌకలను లేదా స్థావరాలను 800 కి.మీ దూరం నుంచి ముంచివేయగలదు.

పరిధి: 800 కి.మీ.
వేగం: గంటకు 3704 కి.మీ.
బరువు: 2,500 కిలోలు
మార్గదర్శకత్వం: INS + GPS + యాక్టివ్ రాడార్
ప్లాట్‌ఫామ్: ఓడ, జెట్, జలాంతర్గామి, భూమి

పాకిస్థాన్ బాబర్ (700 కి.మీ) క్షిపణి కంటే భారత బ్రహ్మోస్-ER ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు, చాలా వేగవంతమైనది. 2025 లో 220 ER వెర్షన్లు ఆర్డర్ చేశారు. హైపర్సోనిక్ బ్రహ్మోస్-II (9878 కి.మీ/గం, 1,500 కి.మీ) వస్తోంది.

READ ALSO: Pakistan: రణరంగంగా పాకిస్తాన్.. ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనల్లో 11 మంది మృతి..

Exit mobile version