Site icon NTV Telugu

Blind Cricket: వరల్డ్‌ ఛాంపియన్‌గా పాక్.. ఫైనల్లో టీమిండియా ఓటమి

Blind Cricket

Blind Cricket

తొలి బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌ ఫైనల్లో టీమిండియా పురుషుల అందుల క్రికెట్‌ జట్టుకు నిరాశ ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నిన్న (శనివారం) పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో రజత పతకాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 రన్స్ చేసింది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

టీమిండియా ఇన్నింగ్స్‌లో డాక్టర్ టోంపాకీ పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. సల్మాన్‌, మునీర్‌ తమ అద్భుత ఇన్నింగ్స్‌లతో పాక్‌ను ఛాంపియన్‌గా నిలిపారు. కాగా, భారత బౌలర్లు ఎక్స్‌ట్రాలా రూపంలో ఏకంగా 42 పరుగులు ఇవ్వడం గమానార్హం.

Read Also: Gold Price Today: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవే..!

ఇక, అంతకు ముందు భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు మాత్రం రికార్డ్ సృష్టించింది. ఫైనల్లో టీమిండియా.. ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి విశ్వవిజేతగా నిలిచింది. తద్వారా గోల్డ్‌ మెడల్‌ను తమ ఖాతాలో టీమిండియా ఉమెన్స్ జట్టు వేసుకుంది. దీంతో ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ గేమ్స్‌ తొలి ఛాంపియన్‌గా భారత జట్టు రికార్డులకెక్కింది.

Exit mobile version