NTV Telugu Site icon

IML 2025 Final: ఫైనల్ చేరిన వెస్టిండీస్.. టైటిల్ కోసం భారత్తో అమితుమీ

Iml 2025

Iml 2025

IML 2025 Final: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML) 2025లో ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. మొదటి సెమీఫైనల్ లో ఆస్ట్రేలియాపై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీమిండియా ఫైనల్ లో సగర్వాంగా అడుగు పెట్టింది. ఇక రెండో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్ అద్భుత ప్రదర్శన చేస్తూ శ్రీలంక మాస్టర్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఇక ఫైనల్‌లో ఈ జట్టు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలోని ఇండియా మాస్టర్స్‌ను ఢీ కొట్టనుంది. ఆదివారం (మార్చి 16) నాడు జరిగే టైటిల్ పోరు షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది.

Read Also: IPL 2025 Captains: ఈసారి ఐపిఎల్ లో కొత్త కెప్టెన్స్ వీళ్లే..

శుక్రవారం (మార్చి 14) జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్ మాస్టర్స్ శ్రీలంక మాస్టర్స్‌పై విజయం సాధించింది. బ్రియాన్ లారా (41), దినేష్ రామ్దీన్ (50 నాటౌట్), టీనో బెస్ట్ (4 వికెట్లు) అద్భుత ప్రదర్శన చేయడంతో వెస్టిండీస్ 179/5 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు, టీనో బెస్ట్‌ ధాటికి కష్టాల్లో పడింది. అసెలా గుణరత్నె (66), ఉపుల్ తరంగ (30) రాణించినప్పటికీ చివరకి నిర్ణిత 20 ఓవర్లలో 173/9 మాత్రమే చేయగలిగింది. దీనితో శ్రీలంక ఓటమి పాలైంది.

ఇండియా మాస్టర్స్ ఇప్పటికే ఫైనల్‌కు చేరింది. మొదటి సెమీ ఫైనల్‌లో ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్‌ను 94 పరుగుల తేడాతో చిత్తుచేసింది. ఇందులో ఇండియా జట్టు 220/7 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 18.1 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది.

Read Also: LYCA : వాయిదా వేసేది లేదు.. చెప్పిన డేట్ కి రిలీజ్ పక్కా

ఫైనల్‌లో తలపడబోయే జట్ల టీమ్స్ ను ఈ విధంగా అంచనా వేయవచ్చు.

ఇండియా మాస్టర్స్ జట్టు:
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన ఓజా (వికెట్ కీపర్), ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, సౌరభ్ తివారీ, గుర్కీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ, వినయ్ కుమార్, అంబాటి రాయుడు, యువరాజ్ సింగ్, ధవల్ కులకర్ణి, సురేశ్ రైనా, షాబాజ్ నదీమ్.

వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు:
బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండల్ సిమ్మన్స్, నర్సింగ్ డేవ్‌నారైన్, అశ్లే నర్స్, డ్వేన్ స్మిత్, ఛాడ్‌విక్ వాల్టన్, దినేష్ రామ్దీన్, విలియమ్స్ పర్కిన్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రంపాల్, సులేమాన్ బెన్, టీనో బెస్ట్.

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ – వెస్టిండీస్ మాస్టర్స్ మధ్య మంచి పోటీ నెలకొనబోతోంది. టైటిల్‌ను ఎవరు గెలుచుకుంటారో చూడాలి మరి.