NTV Telugu Site icon

IND vs AUS: యువరాజ్‌ సింగ్‌ సిక్సర్ల మోత.. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చిత్తు!

Yuvraj Singh Fifty

Yuvraj Singh Fifty

ఇంటర్నేషనల్‌ మాస్టర్స్‌ లీగ్‌ (ఐఎమ్‌ఎల్) 2025లో ఇండియా మాస్టర్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం రాయపూర్‌ వేదికగా ఆస్ట్రేలియా మాస్టర్స్‌తో జరిగిన సెమీఫైనల్లో ఇండియా 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 221 పరుగుల ఛేదనలో ఆసీస్‌ 18.1 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయింది. ఇండియా తరఫున యువరాజ్‌ సింగ్‌ (59; 30 బంతుల్లో 1×4, 7×6) సిక్సర్ల మోత మోగించగా.. షాబాజ్‌ నదీమ్‌ (4/15) బంతితో మాయ చేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన షాబాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది.

Also Read: IPL 2025: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్‌ హ్యారీ బ్రూక్‌పై రెండేళ్ల నిషేధం!

సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా మాస్టర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోరు చేసింది. యువరాజ్‌ సింగ్‌ (59; 30 బంతుల్లో 1×4, 7×6) హాఫ్ సెంచరీ చేశాడు. యువీ తన మార్క్ సిక్సులతో విరుచుకుపడ్డాడు. సచిన్‌ టెండ్యూలర్ (42; 30 బంతుల్లో 7×4), స్టువర్ట్‌ బిన్నీ (36; 21 బంతుల్లో 5×4, 1×6) మెరుపులు మెరిపించారు. ఆసీస్‌ బౌలర్లలో డోహర్టీ (2/30), డానియల్‌ క్రిస్టియన్‌ (2/40) వికెట్స్ తీశారు. ఛేదనలో షాబాజ్‌ నదీమ్‌ (4/15) సహా వినయ్‌ కుమార్‌ (2/10), ఇర్ఫాన్‌ పఠాన్‌ (2/31) విజృంభించడంతో ఆసీస్ ఆలౌట్ అయింది. బెన్‌ కటింగ్‌ (39) టాప్‌ స్కోరర్‌. వెస్టిండీస్, శ్రీలంక మధ్య రెండో సెమీస్‌ విజేతతో ఇండియా ఫైనల్‌ ఆడుతుంది.