Site icon NTV Telugu

India Labour Codes: వారానికి 4 రోజులే పని..? కొత్త లేబర్ కోడ్స్‌పై కేంద్ర కార్మిక శాఖ క్లారిటీ..!

India Labour Codes

India Labour Codes

India Labour Codes: భారతదేశంలో సాధారణంగా ఉద్యోగులు వారానికి 5 రోజులు పని చేసే విధానం కొనసాగుతోంది. అయితే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు 4 రోజుల పని వరాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశాయి. అయితే అవి మంచి ఫలితాలు సాధించడంతో భారత్‌లో కూడా ఇదే విధానం సాధ్యమా అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది.

IPL 2026 Auction: రేపే అబుదాబిలో ఆటగాళ్లకు బిడ్డింగ్.. సిద్ధమైన ఫ్రాంచైజీలు..!

కేంద్ర కార్మిక శాఖ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ, కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం 4 రోజుల పని విధానం సాధ్యమేనని తెలిపింది. అయితే ఇందుకు కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. వారానికి మొత్తం పని గంటలు 48 గంటలు మించకూడదు. అంటే ఉద్యోగులు 4 రోజులు పనిచేస్తే, రోజుకు గరిష్టంగా 12 గంటలు పని చేయవచ్చు. మిగిలిన 3 రోజులు పెయిడ్ సెలువులుగా ఉంటాయి.

అయితే రోజుకు 12 గంటల పని అనగానే నిరంతరం 12 గంటలు డెస్క్ వద్దే కూర్చోవాల్సిన అవసరం లేదని కార్మిక శాఖ వివరించింది. ఇందులో విరామాలు, బ్రేకులు కూడా కలిసే లెక్కిస్తారు. అయితే ఒక రోజులో 12 గంటలకు మించి పనిచేస్తే మాత్రం అదనపు గంటలకు డబుల్ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. 2025 నవంబర్ 21 నుంచి ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. అందులో వేతనాల కోడ్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020,
ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 లు ఉన్నాయి. ఈ చట్టాల ఉద్దేశ్యం సమయానికి వేతనాలు, స్థిరమైన పని గంటలు, మెరుగైన భద్రత, ఆరోగ్య సదుపాయాలు కల్పించడమే.

కార్ లవర్స్కి గుడ్న్యూస్.. Tata Safari, Harrierలకు పెట్రోల్ వైర్షన్.. త్వరలోనే షూరు!

కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానమైన లీవులు, ఆరోగ్య భీమా, సామాజిక భద్రత లభిస్తుంది. ఇక గ్రాట్యుటీ విషయానికి వస్తే, ఇప్పటివరకు 5 సంవత్సరాల సేవ అవసరమైతే, ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం నిరంతర సేవతోనే అర్హత కలుగుతుంది. అదేవిధంగా తొలిసారిగా గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫామ్ వర్కర్లు, అగ్రిగేటర్ వర్కర్లను అధికారికంగా గుర్తించారు. ఆధార్‌తో లింక్ చేసిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా వారి సంక్షేమ నిధులు పోర్టబుల్‌గా మారాయి. ఈ మార్పులన్నింటిని పరిశీలిస్తే.. భారత్‌లో కూడా భవిష్యత్తులో 4 రోజుల పని విధానం అమలులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Exit mobile version