NTV Telugu Site icon

West Indies Tour: వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనున్న భారత్.. మ్యాచ్ లు ఎప్పటి నుంచే అంటే..!

Ind Vs Wi

Ind Vs Wi

West Indies Tour: వెస్టిండీస్ లో భారత్ పర్యటన ఖరారైంది. జూలై నుంచి ఆగస్టులో మ్యాచ్ లు జరుగనున్నాయి. ఈ పర్యటనలో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జులై 12న డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జూలై 20 నుంచి రెండో టెస్టు జరగనుంది. అంతేకాకుండా బార్బడోస్‌లోని కెన్సింగ్‌టన్ ఓవల్‌లో జూలై 27 మరియు 29 తేదీలలో సిరీస్‌లోని మొదటి రెండు ODIలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ తర్వాత ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో ఆగస్టు 1న మూడవ వన్డే జరుగనుంది.

Read Also: Rahul Gandhi: పరువునష్టం కేసు.. రాహుల్‌ గాంధీకి స్వల్ప ఊరట

అటు టీ20 సిరీస్ కు సంబంధించి గయానాలోని బ్రియాన్ లారా స్టేడియం మరియు నేషనల్ స్టేడియం ఆగస్ట్ 3, 6 మరియు 8 తేదీలలో మూడు టీ 20 మ్యాచ్‌లు జరుగనున్నాయి.
అంతేకాకుండా ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియంలో ఆగస్టు 12 మరియు 13 తేదీలలో వరుసగా నాలుగు మరియు ఐదవ T20Iలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఐపీఎల్ లో రెండునెలల పాటు ఆడిన టీమిండియా ఆటగాళ్లు.. మంచి జోరు మీద ఉన్నారు. కానీ మొన్న జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ లో మాత్రం భారత ప్లేయర్లు మంచి ప్రదర్శన చూపించకపోతే ఐసీసీ ట్రోపీని గెలువలేకపోయారు. చూడాలీ మరి డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత వెస్టిండీస్ టీమ్ పై ఎలాంటి ప్రదర్శన కనుబరుస్తారో..!

Read Also: SSMB29: మహేష్- రాజమౌళి సినిమా.. మొదలయ్యేది అప్పుడే.. ?

(వెస్టిండీస్‌లో భారత్‌ పర్యటన వివరాలు):

1వ టెస్ట్: జూలై 12-16, విండ్సర్ పార్క్, డొమినికా
2వ టెస్ట్: జూలై 20-24, క్వీన్స్ పార్క్ ఓవల్, ట్రినిడాడ్
1వ ODI: జూలై 27, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
2వ వన్డే: జూలై 29, కెన్సింగ్టన్ ఓవల్, బార్బడోస్
3వ వన్డే: ఆగస్టు 1, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
1వ T20: ఆగస్టు 3, బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ, ట్రినిడాడ్
2వ T20: ఆగస్టు 6, నేషనల్ స్టేడియం, గయానా
3వ T20: ఆగస్టు 8, నేషనల్ స్టేడియం, గయానా
4వ T20: ఆగస్టు 12, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా
5వ T20: ఆగస్టు 13, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, లాడర్‌హిల్, ఫ్లోరిడా