Graham Reid: వరల్డ్‌కప్‌లో ఓటమి.. టీమిండియా కోచ్ రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వదేశంలో జరిగిన హాకీ వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఘోరంగా విఫలమైంది. ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ కనీసం క్వార్టర్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఏకంగా తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుని నిరాశపర్చింది. దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఇండియన్ హాకీ టీమ్ కోచ్‌గా ఉన్న గ్రహమ్ రీడ్.. ఈ టోర్నీ ముగిసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేశాడు. అతనితోపాటు ఎనలిటికల్ కోచ్‌గా ఉన్న గ్రెగ్ క్లార్క్, సైంటిఫిక్ అడ్వైజర్ మిచెల్ డేవిడ్ కూడా తమ పదవుల నుంచి తప్పుకొన్నారు. ఈ వరల్డ్ కప్‌లో జర్మనీ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆదివారం (జనవరి 29) జరిగిన ఫైనల్లో బెల్జియంపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది.
Murali Vijay: క్రికెట్‌కు మురళీ విజయ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్
Also Read
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
గ్రూప్ స్టేజ్ ముగిసిన తర్వాత ఇండియా పూల్-డిలో ఇంగ్లాండ్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది. ఈ గ్రుప్ నుంచి క్వార్టర్ ఫైనల్ చేరడానికి క్రాస్ ఓవర్ మ్యాచ్ ఆడింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. ఒక దశలో 3-1తో ఆధిక్యంలో ఉన్నా చివరికి కివీస్‌కు స్కోరు సమం చేసే అవకాశం ఇవ్వడం, పెనాల్టీ షూటౌట్లో చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. అయితే వరల్డ్ కప్‌లో విఫలమైనా కోచ్ గ్రహమ్ రీడ్ ఆధ్వర్యంలో ఇండియన్ టీమ్ 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించింది. నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో ఇండియన్ టీమ్ గెలిచిన తొలి మెడల్ ఇదే కావడం విశేషం.ఇక 2022 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ సిల్వర్ మెడల్ గెలుచుకుంది. 2021-22 ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ సీజన్ లో ఇండియన్ టీమ్ మూడోస్థానంలో ఉంది. 2019లో గ్రహమ్ రీడ్ ఇండియన్ టీమ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. టీమ్, హాకీ ఇండియాతో కలిసి ఇన్నేళ్లు పని చేయడం గర్వకారణంగా భావిస్తున్నట్లు తన రాజీనామా సందర్భంగా రీడ్ పేర్కొన్నాడు.
AP Three Capitals: మూడు రాజధానులపై రేపు విచారణ.. సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ
తాజావార్తలు
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!