NTV Telugu Site icon

Paris Olympics 2024: రూ.470 కోట్ల ఖర్చు.. పతకాలు మాత్రం ఆరు! ఒక్కో పతకంకు 78 కోట్లు

Paris Olympics 2024

Paris Olympics 2024

India Govt Spent Rs 78 Crores per medal: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మెడల్స్ సంఖ్య డబుల్ డిజిట్‌ను చేరుకోలేదు. భారత అథ్లెట్లు ఓ రజతం, ఐదు కాంస్యాలతో మొత్తంగా ఆరు పతకాలనే సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్.. మెడల్స్ పట్టికలో 71వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ 2016లో రెండు పతకాలను మాత్రమే సాధించిన భారత్.. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం 7 పతకాలతో సత్తాచాటింది. దాంతో ఈసారి పక్కాగా డబుల్ డిజిట్‌ను దాతుందని భారత ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పారిస్ ఒలింపిక్స్ సన్నాహకాల కోసం కోట్లు ఖర్చు పెట్టింది.

గత మూడేళ్లుగా పారిస్ ఒలింపిక్స్ కోసం భారత ప్రభుత్వం ఏకంగా రూ.470 కోట్లను ఖర్చు పెట్టింది. అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ.96.08 కోట్లు ఖర్చు చేయగా.. బ్యాడ్మింటన్‌కు రూ.72.02 కోట్లు, బాక్సింగ్‌కు రూ.60.93 కోట్లు, షూటింగ్‌కు రూ.60.42 కోట్లు ఖర్చు పెట్టింది. షూటింగ్‌లో మూడు పతకాలు రాగా.. అథ్లెటిక్స్‌లో ఒక పతకం వచ్చింది. రెజ్లింగ్‌లో ఒకటి, భారత్ హాకీ టీమ్ ఓ పతకం గెలిచింది.

Also Read: Viral Video: ఫుట్‌బాల్ మ్యాచ్ ఓడినందుకు.. విద్యార్థులను చితకబాదిన పీఈటీ టీచర్!

రెజ్లర్ వినేశ్ ఫోగట్ అధిక బరువుతో అనర్హత వేటుకు గురైన విషయం తెలిసిందే. కచ్చితంగా పతకాలు పక్కా వస్తాయని ఆశించిన బ్యాడ్మింటన్, ఆర్చరి, బాక్సింగ్ ఈవెంట్లలో భారత్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. దాంతో భారత ప్రభుత్వం పెట్టిన రూ.470 కోట్ల ఖర్చుకు.. వచ్చిన పతకాలకు ఏమాత్రం సంబంధం లేదని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఒక్కో పతకం కోసం భారత్ రూ.78 కోట్లు ఖర్చు పెట్టిందని ఎద్దేవా చేస్తున్నారు.

Show comments