NTV Telugu Site icon

Indian Flag on Burj Khalifa: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫాపై భారత జెండా.. పాకిస్తానీలకు మాత్రం నిరాశ!

Indian Flag On Burj Khalifa

Indian Flag On Burj Khalifa

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని అందంగా ముస్తాబవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఢిల్లీలో ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.30 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా జెండా ఎగరవేయనున్నారు.

77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫాపై భారత జెండాను ప్రదర్శించారు. అర్ధరాత్రి (12 గంటల ఒక్క నిమిషంకు) దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై ఎల్‌ఈడీ లైట్లతో భారత జెండాను ప్రదర్శించారు. ఈ సమయంలో భారత జాతీయ గీతంను కూడా వినిపించింది. ఈ అద్బుత దృశ్యాలను చూసిన అక్కడి భారత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: Russia Explosion: రష్యాలో భారీ పేలుడు.. 12 మంది మృతి! 60 మందికి గాయాలు

మరోవైపు ఆగస్టు 14న పాకిస్థాన్ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటుంది. ఈ వేడుకల సందర్భంగా 2716.5 అడుగుల ఎత్తైన బుర్జ్‌ ఖలీఫా భవనంపై పాకిస్తాన్ జెండాను ప్రదర్శించడానికి బుర్జ్ ఖలీఫా కమిటీ నో చెప్పింది. ఈ ఏడాది అస్సలు ప్రదర్శించేది లేదని తేల్చి చెప్పింది. దీంతో పాకిస్తానీ జనం అవమానంగా ఫీలయ్యారు. బుర్జ్‌ ఖలీఫా భవనం వద్ద పెద్ద ఎత్తున పాకిస్తానీ జనం ఉన్న వీడియో నెట్టింట వైరల్ అయింది.

Show comments