Global Hunger Index: ఆకలి సూచీలో భారత్ అట్టడుగు స్థానానికి పడిపోయింది. భారతదేశం 121 దేశాలతో విడుదల చేసిన జాబితాలో 2021లో 101 స్థానంలో ఉండగా.. ఈ ఏడాది 107వ స్థానానికి పడిపోయింది. పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్‌ల కంటే వెనుకబడి ఉంది. శ్రీలంక (64వ ర్యాంక్), నేపాల్ (81), బంగ్లాదేశ్ (84), పాకిస్థాన్ (99) మన దేశం కన్నా ముందున్నాయి. దక్షిణాసియా దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ (109 ర్యాంక్) మాత్రమే భారత్ కన్నా దిగువన ఉంది. చైనా, టర్కీ, కువైట్‌తో సహా పదిహేడు దేశాలు ఐదు కంటే తక్కువ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోర్‌తో టాప్ ర్యాంక్‌ను పంచుకున్నాయని ఆకలి, పోషకాహార లోపాన్ని ట్రాక్ చేసే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్‌సైట్ శనివారం తెలిపింది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని 8 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో 2014 నుంచి భారత స్కోరు మరింత దిగజారిందని కాంగ్రెస్ ఎంపీ పి.చిదంబరం విమర్శించారు.
ఇండియాలో చైల్డ్ వేస్టింగ్ రేటు( వయస్సు కన్నా తక్కువ బరువు, ఎత్తు ఉండడం) 19.3 శాతంతో ప్రపంచంలో అత్యంత తీవ్ర సమస్యగా ఉంది. 2014 (15.1 శాతం), 2000 (17.15 శాతం) కంటే అధ్వానంగా ఉంది. భారత్‌లో పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మన్ సంస్థ వెల్ట్ హంగర్ హిల్ఫ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో భారతదేశంలో ఆకలి స్థాయి తీవ్రంగా ఉందని పేర్కొంది. పేర్కొంది.2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ జాబితాలో 121 దేశాలతో 107వ ర్యాంక్‌కు పడిపోయింది. భారత జీహెచ్‌ఐ స్కోర్ కూడా క్షీణించింది. భారత్ గత ఏడాది 100వ ర్యాంక్ దిగువకు పడిపోయిన నేపథ్యంలో ఈ నివేదిక అశాస్త్రీయమని ప్రభుత్వం పేర్కొంది.
Pakistan: పాకిస్తాన్‌లో షాకింగ్.. ఆస్పత్రి పైకప్పుపై 200 కుళ్లిపోయిన శవాలు
ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్‌ఐ) అనేది ప్రపంచ, ప్రాంతీయ, జాతీయస్థాయిలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, గుర్తించడానికి ఒక సాధనంగా భావిస్తున్నారు. పోషకాహార లోపం, పిల్లల పెరుగుదల, చైల్డ్ వేస్టింగ్, పిల్లల మరణాలు వంటి నాలుగు అంశాల ఆధారంగా జీహెచ్‌ఐలో స్కోరు ఇస్తారు. ఈ స్కోర్ల ఆధారంగా తక్కువ, మధ్యస్థం, తీవ్రం, ఆందోళన, అత్యంత ఆందోళన అనే కేటగిరీలుగా దేశాలను విభజించారు. భారత్‌కు 29.1 శాతం స్కోరుతో ‘తీవ్రమైన దేశాల’లో ఉంది.