Site icon NTV Telugu

India Test Schedule 2025: మరోసారి టెస్టు బరిలోకి టీమిండియా.. సౌతాఫ్రికాతో పోరు ఎప్పుడంటే..?

India Narrowest Test Win

India Narrowest Test Win

India Test Schedule 2025: నరాలు తెగే ఉత్కంఠకు ముగింపు పలుకుతూ యువ భారత్ అండర్సన్- తెందుల్కర్ టెస్టు సిరీస్‌లో ఐదో మ్యాచ్‌ను అద్వితీయమైన ఆటతీరుతో​ముగించింది. థ్రిల్లింగ్ విక్టరీతో టీమ్ఇండియా ఈ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. టెస్ట్ క్రికెట్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ జోష్ ఇచ్చినట్లైంది. ఇన్నిరోజులు టీ20, వన్డే మ్యాచ్‌లపై ఎక్కువ ఆసక్తి చూపే క్రికెట్ లవర్స్ ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లకు సైతం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరి తెలుసుకుందామా టీం ఇండియా తదుపరి టెస్ట్ సిరీస్ ఎప్పుడు ఉందో..

READ MORE: TVS Raider 125: బైక్ లవర్స్ కు షాక్.. పెరిగిన టీవీఎస్ రైడర్ 125 ధర.. డోంట్ వర్రీ.. ఆఫర్లతో ఆదా చేసుకోవచ్చు

అప్పుడే మళ్లీ మైదానంలో దిగేది..
మరో రెండు నెలల సమయం తర్వాత భారత్ టెస్టుల్లో బరిలోకి దిగనుంది. అక్టోబర్‌లో వెస్టిండీస్, భారత్ పర్యటనకు రానుంది. అక్టోబర్ 02 నుంచి 14 వరకు ఈ సిరీస్ జరగనుంది. ఈ పర్యటనలో భారత్- వెస్టిండీస్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నారు. ఆ తర్వాత నవంబర్‌లో​సౌతాఫ్రికా కూడా భారత్ పర్యటనకు రానుంది. సఫారీ జట్టుతో భారత్ రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

వెస్టిండీస్‌, సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ వివరాలు..
తొలి టెస్టు- అక్టోబర్ 02 నుంచి 06- నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్, రెండో టెస్టు- అక్టోబర్ 10 నుంచిన 14- అరుణ్ జైట్లీ స్టేడియం, దిల్లీలో జరగనుంది. సౌతాఫ్రికాతో తొలి టెస్టు- నవంబర్ 14 నుంచి 18- ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి 26- బారాబతి స్టేడియం, గువాహటిలో జరగనుంది.

READ MORE: Hyderabad Horror: హైదరాబాద్‌లో దారుణం.. పట్టపగలే కత్తిలతో నరికి హత్య..!

WTC Points Tableలో భారత్ స్థానం.. :
తాజా విక్టరీతో టీం ఇండియా వరల్డ్​టెస్టు ఛాంపియన్​షిప్​పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. దీంతో ప్రస్తుతం 28 పాయింట్లు, 46.67 పాయింట్ పర్సెంటేజీతో టీమ్ఇండియా మూడో ప్లేస్​లో కొనసాగుతోంది. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో భారత్‌కు ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 2 ఓటములు ఉండగా, మరో మ్యాచ్ డ్రా చేసుకుంది. ఇంగ్లాండ్ కూడా 2 విజయాలు, 2 ఓటములు, 1 డ్రా తో 43.33 పాయింట్ పర్సెంటేజీతో నాలుగో స్థానానికి పడిపోయింది. నెంబర్ వన్‌లో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. ఆసీస్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్​ల్లోనూ నెగ్గి 100 శాతం పాయింట్ పర్సెంటేజీతో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక 66.66 పాయింట్ పర్సెంటేజీతో రెండో ప్లేస్‌లో ఉంది. 2027 మార్చి నాటికి టాప్ -2 లో ఉన్న రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగుతుంది.

Exit mobile version