Site icon NTV Telugu

Cricketers Salary: ఎందుకు ఇంత చిన్న చూపు.. పురుషుల, మహిళల వేతనాలలో ఎంత తేడానో తెలుసా..?

Cricketers Salary

Cricketers Salary

Cricketers Salary: నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టోర్నమెంట్‌లలో తమకు తొలిసారిగా విజయం దక్కించుకుని.. మొదటి మహిళల ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఈ ఘనత దేశవ్యాప్తంగా వేడుకలు చేసుకునేందుకు కారణంగా నిలిచింది. 52 పరుగుల తేడాతో సాధించిన ఈ విజయం భారత మహిళా క్రికెట్‌పై దేశం దృష్టిని మళ్లించింది. ఈ విజయాన్ని పురస్కరించుకొని భారత మహిళల క్రికెట్‌లోని ఆర్థిక స్థితిగతులను పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీసీసీఐ అందించే వార్షిక వేతనాలు ప్రధాన అంశంగా నిలిచింది.

200MP కెమెరా, 5400mAh బ్యాటరీ.. Samsung Galaxy S26 వచ్చేది అప్పుడే!

బీసీసీఐ మార్చి 24, 2025న విడుదల చేసిన “వార్షిక ప్లేయర్ రిటైన్‌ర్‌షిప్ 2024–25 టీమ్ ఇండియా (సీనియర్ మహిళలు) ప్రకారం.. మహిళా క్రికెటర్లకు జీతాలు మూడు గ్రేడ్‌లుగా విభజించబడ్డాయి. ఇందులో గ్రేడ్ A కాంట్రాక్ట్ పొందిన క్రీడాకారిణులకు సంవత్సరానికి రూ.50 లక్షలు వేతనం లభిస్తుంది. ఈ విభాగంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఉన్నారు. ఇక గ్రేడ్ B కాంట్రాక్ట్‌లో ఉన్న రేణుక ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మ వంటి ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.30 లక్షలు లభిస్తాయి. ఇక గ్రేడ్ C కాంట్రాక్ట్‌లో ఉన్న రాధా యాదవ్, అమన్‌జోత్ కౌర్, ఉమా చైత్రీ, స్నేహ్ రాణా, ఇతర తొమ్మిది మంది క్రీడాకారిణులకు సంవత్సరానికి రూ.10 లక్షల వేతనం చెల్లిస్తారు.

Richest Female Cricketers: ఆటే కాదు సంపదలో కూడా ఘనమే.. టీమిండియా రిచెస్ట్ మహిళా క్రికేటర్స్ వీరే..!

అయితే ఈ వేతనాలు భారత పురుషుల జట్టుతో పోల్చితే.. భారీ వ్యత్యాసం కనపడుతుంది. ఏప్రిల్ 21, 2025న విడుదల చేసిన పురుషుల జట్టు కాంట్రాక్ట్ ప్రకారం A+ గ్రేడ్ ఆటగాళ్లకు 7 కోట్లు, A గ్రేడ్‌కి 5 కోట్లు, B గ్రేడ్‌కి 3 కోట్లు, C గ్రేడ్‌కి 1 కోటి వేతనం లభిస్తోంది. దీనితో పోలిస్తే మహిళల జట్టులో అగ్రశ్రేణి కాంట్రాక్ట్ అయిన గ్రేడ్ A వేతనం కేవలం రూ.50 లక్షలు మాత్రమే కావడం గమనార్హం. అయితే మ్యాచ్ ఫీజు విషయంలో మాత్రం సమానత్వం కనపడుతుంది. బీసీసీఐ పురుషులు, మహిళలకు సమానమైన మ్యాచ్ ఫీజును అందిస్తోంది. టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు 3 లక్షలుగా చెల్లిస్తోంది. పురుషుల జట్టు ఏడాదికి ఎక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడుతుండటంతో మ్యాచ్ ఫీజుల ద్వారా వారి మొత్తం ఆదాయం గణనీయంగా ఎక్కువగా ఉంటుంది.

Exit mobile version