ఇండియా లో కరోనా కేసులు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి రోజున భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగిపోయాయి. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం … గత 24 గంటల్లో కొత్తగా 16,326 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 666 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.
ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,73,728 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 101.30 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. అలాగే నిన్న ఒక్క రోజే 59.84 లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.16 శాతంగా ఉంది.
