Site icon NTV Telugu

ఇండియాలో కొత్తగా 8895 కరోనా కేసులు

ఇండియా కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 8,895 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 2796 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 34,633,255 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య 473,326 కు చేరుకుంది.

ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 99,155 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. ఇక మరో వైపు.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కొనసాగుతుండగా.. ఇప్పటి వరకు 1,27,61,83,065 మందికి పైగా టీకా వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 1, 04,18, 707 టీకాలు వేసినట్లు బులెటిన్‌లో పేర్కొంది

Exit mobile version