Site icon NTV Telugu

ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 24 గంటల్లో 46,759

దేశంలో క‌రోనా టెర్రర్‌ కొనసాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో కొత్తగా 46,759 కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,26,49,947 కి చేర‌గా ఇందులో 3,18,52,802 మంది ఇప్పటికే కోలుకున్నారు. 3,59,775 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 509 మంది మృతి చెందారు. దీంతో భార‌త్‌లో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,37,370 మంది క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 24 గంట‌ల్లో 1,03,35,290 మందికి టీకాలు వేశారు. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 62,29,89,134 మందికి టీకాలు వేసిన‌ట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.

Exit mobile version