Site icon NTV Telugu

ఇండియా కరోనా అప్డేట్… కొత్తగా 31,382 కేసులు

ఇండియాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 31,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.. మరో 318 మంది కోవిడ్‌ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇక, ఇదే సమయలో 32,542 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,00,162 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.. 187 రోజుల్లో ఇదే అతి తక్కువ.. మరోవైపు.. రికవరీ కేసుల సంఖ్య 3,28,48,273 కు పెరగగా.. కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 4,46,368 కు చేరింది.. ఇక, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 72,20,642 టీకా డోసులు పంపిణీ చేయగా.. ఇప్పటి వరకు 84,15,18,026 డోసులు వేసినట్టు తెలిపింది కేంద్రం.

Exit mobile version