India Book of Records Visionary Man Award: భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డు వరించింది.. ఈ అవార్డు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మంత్రి మల్లారెడ్డి.. సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో డైరెక్టర్స్ ప్రీతి రెడ్డి, భద్రా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి ఈ సందర్భంగా ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డును అందించారు. ఇక, తనకు అవార్డు రావడం పట్ల సంతోషాన్ని మెడికోలతో పంచుకున్నారు మంత్రి మల్లారెడ్డి.
Read Also: Minister RK Roja: గాంధీ, అంబేద్కర్ అడుగుజాడల్లో సీఎం జగన్ పాలన..
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదం వల్ల జీవితంలో తనకు అన్ని సంపదలు చేకూరాయని, ఇక, మిగిలిఉన్న జీవితం అంతా.. ప్రజా శ్రేయస్సు కోసం పని చేస్తానన్నారు. కష్టపడితే ఎంతటి విజయాన్ని అయినా సాధించవచ్చు అనే దానికి ఈ అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. స్కూళ్లు పెట్టిన, కాలేజీలు పెట్టిన, మెడికల్ కాలేజీలు పెట్టిన, ఎంపీ అయిన, ఎమ్మెల్యేను అయిన, మంత్రి అయ్యాయని తెలిపారు.. మనిషి ప్రయత్నం చేస్తే.. ఎంత గొప్పవాళ్లు అయినా కావొచ్చు అన్నారు మంత్రి మల్లారెడ్డి.. ఇప్పుడు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ విజనరీ మ్యాన్’ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. ఒక్కప్పుడు పాలు అమ్మిన, పూలు అమ్మిన.. బోర్‌వెల్స్ నడిపిన, మెడికల్ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు స్థాపించి ప్రపంచం గర్వించే విధంగా డాక్టర్లను, ఇంజనీర్లను తయారు చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి.