Site icon NTV Telugu

Asia Airgun ChampionShip 2022: కొనసాగుతున్న పతకాల వేట.. భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణాలు

Asia Airgun Championship

Asia Airgun Championship

Asia Airgun ChampionShip 2022: కొరియాలోని డేగులో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లలో భారత్ మరో నాలుగు స్వర్ణ పతకాలను గెలుచుకుంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో శివ నర్వాల్‌ గెలుపొందగా, జూనియర్‌ పురుషుల విభాగంలో సాగర్‌ డాంగీ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు.పురుషుల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో అనుభవజ్ఞుడైన కొరియన్ పార్క్ డేహున్‌పై శివ మెరుగ్గా నిలిచి.. గట్టి పోటీలో అతన్ని 17-13తో ఓడించాడు. జూనియర్‌ మహిళల 10 ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్‌ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్‌ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది.

ICC T20I Rankings: నంబర్‌ వన్‌ స్థానం సూర్యకుమార్‌ యాదవ్‌దే..

సీనియర్‌ మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఫైనల్లో రిథమ్‌ సాంగ్వాన్‌ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. సీనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ టీమ్‌ ఫైనల్లో సాగర్, సామ్రాట్‌ రాణా, వరుణ్‌ తోమర్‌లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్‌ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్‌లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి.   

Exit mobile version