Paris Olympics 2024: పారిస్ వేదికగా ఒలింపిక్స్-2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఒలింపిక్స్ ఆరంభరోజు భారత్‌కు చెందిన అథ్లెట్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. యువ షూటర్ మనుబాకర్ మాత్రం అదరగొట్టింది. 2020 ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో పోటీ పడి ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరకుండా నిరాశపరిచిన మనుబాకర్.. ఈ సారి అంచనాలను అందుకుంటూ పోటీ పడ్డ తొలి ఈవెంట్‌లోనే ఫైనల్ చేరి పతకం మీద ఆశలు రేపింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో మూడో స్థానంతో తుది పోరుకు అర్హత సాధించిన మను బాకర్.. ఆదివారం ఫైనల్ ఆడనుంది. క్వాలిఫికేషన్ జోరును ఫైనల్లోనూ కొనసాగిస్తే ఆమె ఖాతాలో పతకం పడబోతున్నట్లే. అదేవిధంగా మను బాకర్ మరో రెండు విభాగాల్లోనూ పోటీ పడనుంది. మరోవైపు ఇవాళ భారత్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సిందు ఒలింపిక్స్ లో తన పోరును ప్రారంభించనుంది.
ప్రతిసారీ ఒలింపిక్స్‌లో నిరాశపరిచే ఆర్చర్లు.. ఈ సారి పతకం ఆశలు రేపుతూ.. అర్హత రౌండ్లలో అదరగొట్టారు. ఇటు మహిళలు, అటు పురుషులు క్వార్టర్స్‌కు దూసుకొచ్చారు. ఇంకో రెండు విజయాలు సాధిస్తే పతకం ఖాయం. ఈ నేపథ్యంలో మహిళల జట్టు ఆదివారం క్వార్టర్స్‌కు సిద్ధమైంది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ విజేతతో అంకిత భాకత్, భజన్ కౌర్, దీపిక కుమారిలతో కూడిన భారత బృందం తలపడనుంది. అమ్మాయిలు క్వార్టర్స్ దాటితే కొరియాను ఢీకొననున్నారు. ఈ విభాగంలో పతక ఈవెంట్లు ఆదివారమే పూర్తి కానున్నాయి. పురుషులలో బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్, ప్రవీణ్ జాదవ్‌లతో కూడిన జట్టు.. సోమవారం క్వార్టర్స్‌లో తలపడుతుంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తుందని భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ ఆదివారం పతక వేటను మొదలు పెట్టనుంది. మహిళల 50 కేజీల విభాగంలో జర్మనీకి చెందిన మ్యాక్సీ కరీనాతో నిఖత్ తలపడుతోంది. రింగ్‌లో నిఖత్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.
నేటి భారత షెడ్యూల్ ఇలా..
టేబుల్ టెన్నిస్:
మహిళల సింగిల్స్ రెండో రౌండ్ (శ్రీజ × క్రిస్టినా) మధ్యాహ్నం 12.15 గంటలకు,
మనికా బాత్రా × అన్నా హెర్సీ)- మధ్యాహ్నం 12.15 గంటలకు,
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ (శరత్ × డెని కొజుల్)- మధ్యాహ్నం 3
షూటింగ్ విభాగంలో:
10మీటర్లు ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ మహిళలు (వలరివన్, రమిత)- మధ్యాహ్నం 12.45,
పురుషులు (సందీప్, అర్జున్)- మధ్యాహ్నం 2.45
బ్యాడ్మింటన్:
మహిళల సింగిల్స్ (పీవీ సింధు × ఫాతిమాత్)- మధ్యాహ్నం 12.50 గంటలకు,
పురుషుల సింగిల్స్ (ప్రణయ్ × ఫాబియన్)- రాత్రి 8 గంటలకు
రోయింగ్ విభాగంలో..
పురుషుల సింగిల్స్ స్కల్ (రెపిఛేజ్ 2): బల్‌రాజ్ పన్వార్, మధ్యాహ్నం 1.18
స్విమ్మింగ్ విభాగంలో:
పురుషుల 100మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్-2 (శ్రీహరి)- మధ్యాహ్నం 3.16 గంటలకు,
మహిళల 200మీటర్ల ఫ్రీస్టైల్ హీట్-1 (దినిది)- మధ్యాహ్నం 3.30 గంటలకు
బాక్సింగ్:
మహిళల 50 కేజీలు తొలి రౌండ్ (నిఖత్ × మ్యాక్సీ కరీనా)- మధ్నాహ్నం 3.50 గంటలకు
షూటింగ్:
10మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఫైనల్ (మనుబాకర్)- మధ్యాహ్నం 3.30 గంటలకు
ఆర్చరీ విభాగంలో:
మహిళల జట్టు క్వార్టర్స్ (అంకిత, దీపిక, భజన్)- సాయంత్రం 5.45 గంటలకు,
సెమీస్- సాయంత్రం 7.17 గంటలకు,
పతక దశ మ్యాచ్‌లు- 8.18 గంటలకు
స్విమ్మింగ్ లో పురుషుల 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లె ఫైనల్ : రాత్రి 12గంటలకు.
మహిళల 100 మీటర్ల బటర్ ప్లై ఫైనల్ : రాత్రి 12.10 గంటలకు.
పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఫైనల్ : రాత్రి 12.50గంటలకు