Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్ దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుంది. వెయిట్‌లిఫ్టింగ్‌లోనే మూడు స్వర్ణాలు దక్కటం విశేషం. ఇవాళ కూడా భారత్ పతక వేటలో పయనించనుంది. ఇవాళ పలు క్రీడల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు పోటీపడనున్నారు. మరి ఇవాళ ఏయే క్రీడల్లో భారత క్రీడాకారులు పాల్గొంటారో తెలుసుకుందాం.
Common Wealth Games 2022: సత్తా చాటుతున్న భారత ఆటగాళ్లు.. ఖాతాలో మూడు స్వర్ణాలు
- వెయిట్‌లిఫ్టింగ్ (పతక ఈవెంట్): అజయ్ సింగ్, పురుషులు 81 కేజీలు (మ.2 గంటల నుంచి), హర్జిందర్ కౌర్ (రా.11 గంటల నుంచి)
- బాక్సింగ్: అమిత్ ఫంగాల్ × బెర్రీ (సా.4.45 నుంచి), మహ్మద్ హుసాముద్దీన్ × సలీమ్ (సా.6 నుంచి), ఆశిష్ కుమార్ × ట్రావిస్ (రా.1 నుంచి)
- హాకీ (పురుషులు): భారత్ × ఇంగ్లాండ్ (రా.8.30 నుంచి)
- బ్యాడ్మింటన్: మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్ (మ.3.30 నుంచి)
- టేబుల్ టెన్నిస్ (పురుషులు): భారత్ × నైజీరియా సెమీఫైనల్స్ (రా.9 గంటల నుంచి)
- లాన్‌బౌల్స్: మహిళల ఫోర్ సెమీఫైనల్స్ (మ.1 నుంచి)
- జూడో: విజయ్, జస్లీన్ సైని, సుశీల దేవి (మ.2.30 నుంచి)