NTV Telugu Site icon

INDIA Bloc: ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ

A1

A1

దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం అయింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో భారత కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి కూటమిలో ఉన్న పార్టీ అధినేతలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. శనివారంతో దేశ వ్యాప్తంగా జరిగిన ఏడు దశల పోలింగ్ ముగిస్తుంది. దీంతో ఓటింగ్ సరళిపై.. అలాగే కౌంటింగ్ రోజున తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇండియా కూటమి.. గెలుపుపై ఆశలు పెట్టుకుంది. అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులపై నేతలంతా చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సమాశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టారు.

ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ. వేణుగోపాల్ (INC), అఖిలేష్ యాదవ్ (SP), శరద్ పవార్, జితేంద్ర అవద్ (NCP), అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా (AAP) , టీఆర్. బాలు (DMK), తేజస్వి యాదవ్, సంజయ్ యాదవ్ (RJD), చంపై సోరెన్, కల్పనా సోరెన్ (JMM), ఫరూక్ అబ్దుల్లా (J&K NC), డి. రాజా (CPI), సీతారాం ఏచూరి (CPIM), అనిల్ దేశాయ్ శివసేన ( UBT), దీపాంకర్ భట్టాచార్య (CPI(ML), ముఖేష్ సహాని (VIP), తదితరలు పాల్గొన్నారు.

Show comments