India Alliance Meeting Today in Delhi: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమి నేతల కీలక సమావేశం నేడు ఢిల్లీలో జరగనుంది. ఇది ఇండియా కూటమి నాలుగో సమావేశం. కూటమిలోని అన్ని పార్టీల కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలపైనా కూటమి నేతలు సమీక్షించనున్నట్టు సమాచారం.
డిసెంబర్ 31లోపు సీట్ల పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని ఇండియా కూటమిలోని పలువురు నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజటి సమావేశంతో సీట్ల సర్దుబాటుపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం ఢిల్లీలో దీదీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిపై స్పందించారు. ఎన్నికలు ముగిసిన తర్వాతే ఇండియా కూటమికి ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని తెలిపారు.
Also Read: Rishabh Pant IPL Auction: ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే తొలి కెప్టెన్‌గా రిషబ్ పంత్ రికార్డు!
ఇక ఇండియా కూటమి కీలక సమావేశం నేపథ్యంలో పాట్నాలో జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ‘పార్లమెంట్ ఎన్నికల్లో గెలవలానుకుంటే.. ధృడ నిశ్చయం కావాలి, నితీశ్ కుమార్ కావాలి’ అని పోస్టర్లపై రాశారు. ఇండియా కూటమికి నితీష్ నాయకత్వం వహించాలని ఆ పోస్టర్ల సారాంశం. అయితే తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని నితీశ్ కుమార్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే.