న్యూజిలాండ్ ఎ జట్టుతో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టు మ్యాచ్ రెండో రోజున భారత్ ఎ జట్టు కోలుకునే ప్రయత్నం చేసింది. న్యూజిలాండ్ ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 204 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించడంతో భారత్ కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు మళ్ళీ ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ తక్కువ పరుగులకే పెవినియన్ చేరారు. జైస్వాల్ నాలుగో ఓవర్లోనే షార్ట్ బాల్‌కు అవుట్ అవ్వగా.. ఆ తర్వాత ఓవర్లోనే రాహుల్ దురదృష్టవశాత్తు హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు.
కేవలం అతి తక్కువ సమయంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో దేవదత్ పడిక్కల్, సాయి సుదర్శన్ బాధ్యతాయుతంగా ఆడారు. మొదట్లోనే లభించిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్న పడిక్కల్ అర్ధశతకంతో (56 పరుగులు) మెరిశాడు. సాయి సుదర్శన్ (39 పరుగులు) ఆయనకు చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు విడిపోకుండా 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఎ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అయితే భారత్ ఇంకా 98 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 135/3తో ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 317 పరుగులకు ఆలౌట్ అయింది. నీల్సన్ బ్యాటర్లు డిన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (51), క్రిస్టియన్ క్లార్క్ నిలకడగా ఆడి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కూడా కీలక పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ ఎ భారీ ఆధిక్యం సాధించగలిగింది. భారత బౌలర్లలో ఆకిబ్ నబీ, అంశుల్ కంబోజ్ చెరో మూడు వికెట్లు తీశారు. మ్యాచ్‌లో గెలవాలంటే భారత బ్యాటర్లు మూడో రోజు కూడా ఇదే తరహాలో పోరాడాల్సి ఉంది.

