Site icon NTV Telugu

Vice Presidential Election: ఎన్నికల కౌంటింగ్‌ షురూ.. ఓటు వేయని ఈ 13 మంది ఎంపీలు..

Vice

Vice

Vice Presidential Election: దేశంలోని 15వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ హౌస్‌లో జరిగింది. మొత్తం 768 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత పార్లమెంటులో లోక్‌సభ, రాజ్యసభతో సహా మొత్తం 788 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం రెండు సభలలో 7 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే.. మొత్తం 781 మంది ఎంపీలు ఓటు వేయాల్సి ఉంటుంది. వారిలో 13 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. వీరిలో బీఆర్ఎస్ నుంచి 4, బీజేడీ నుంచి 7 మంది, శిరోమణి అకాళీదళ్ నుంచి ఒకరు, మరో స్వతంత్ర ఎంపీ ఓటు వేయలేదు. ఎన్డీఏకు చెందిన 427 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. మరి కొద్ది సేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.

READ MORE: CM Revanth Reddy : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం రేవంత్ భేటీ

అభ్యర్థులు నచ్చకపోయినా.. నోటాకు సైతం ఓటు వేసే అవకాశం ఉంది. కానీ.. ఈ ఎంపీలు మాత్రం ఆ పని చేయలేదు. ఎన్నికలనే బహిస్కరించారు. దీంతో వీళ్లపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈసీ నొక్కి చెబుతోంది. ఈ ప్రచారంలో ముందుండాల్సిన ప్రజాప్రతినిధులు నియమాలు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

READ MORE: Breaking News: నేపాల్‌లో ఆగని ఆందోళనలు.. మాజీ ప్రధాని భార్య సజీవ దహనం

Exit mobile version