2025 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. బీజేపీ ఎంపీ డీకే అరుణలు ఒకే వేదికపై కనిపించారు. గతంలో ఈ ఇద్దరూ కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. జెండా ఆవిష్కరణ, ప్రోటోకాల్ విషయంలో పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. ఈరోజు మంత్రి హోదాలో జూపల్లి మహబూబ్ నగర్‌లో జెండా ఆవిష్కరణ చేయగా.. ఎంపీ హోదాలో డీకే అరుణ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నారు.
Also Read: Allu Arjun: చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ అయిపోయారు.. మరి అల్లు అర్జున్ రిస్క్ చేస్తాడా?
జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు. కొల్లాపూర్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ప్రస్తుతం (2023 డిసెంబర్ 7) నుంచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు. మరోవైపు డీకే అరుణ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకురాలు. గద్వాల నియోజకవర్గం నుంచి 2004 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వచించారు. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో స్థానం పొంది జిల్లా తరఫున రాష్ట్ర మంత్రివర్గంలో చోటుపొందిన తొలి మహిళా నేతగా నిలిచారు. ప్రస్తుతం 2024లో మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇద్దరూ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే.
