Site icon NTV Telugu

Nani: నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అదే: నాని

Nani About Jersey

Nani About Jersey

Nani about Jersey Movie: ‘జెర్సీ’ తన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రం అని నేచురల్ స్టార్ నాని తెలిపారు. తన శైలికి పూర్తి భిన్నమైన సినిమా అని, ఎప్పుడో గానీ అలాంటి కథలు రావన్నారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ వస్తూ పోతుంటాయని.. ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి అని పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరం యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న వారితో నాని ప్రత్యేకంగా ముచ్చటించారు. ట్రైనీ కానిస్టేబుళ్లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

జెర్సీ చిత్రంలో నటించడం ఎలా అనిపించింది అని రామకృష్ణ అనే ట్రైనీ కానిస్టేబుళ్ అడగగా… ‘జెర్సీ నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. ఎప్పుడూ హిట్ సినిమాకు మించిన చిత్రంను తీయడానికి ప్రయత్నించాలి. నా శైలికి పూర్తి భిన్నమైన సినిమా జెర్సీ. ఎప్పుడో గానీ అలాంటి కథలు రావు. గొప్ప కథ, మ్యూజిక్, టేకింగ్ అన్ని కుదిరాయి. ప్రతి వ్యక్తి తనకు అనుకున్న విజయం దక్కిన తర్వాత జెర్సీలోని రైల్వేస్టేషన్‌ సీన్‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెట్టడం ఆనందంగా ఉంది. కొంచెం బాధలో ఉన్నపుడు జెర్సీ సినిమా చూస్తామని నాతో చాలామంది చెప్పారు. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ అనేవి వస్తూ పోతుంటాయి కానీ ఇలాంటి ప్రశంసలే ఎప్పటికీ తరగని ఆస్తి’ అని నాని చెప్పుకొచ్చారు.

నాని తాజాగా నటించిన సినిమా ‘సరిపోదా శనివారం’. ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వ‌హిస్తున్నారు. నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‍గా న‌టిస్తుండ‌గా.. డైరెక్టర్ ఎస్‍జే సూర్య కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. డివీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version