IND vs ZIM: విశ్వవిజేత టీమిండియాపై విజయం.. చరిత్ర సృష్టించిన జింబాబ్వే!
- యువ ప్లేయర్స్ దారుణ ప్రదర్శన
- విశ్వవిజేతపై విజయం
- చరిత్ర సృష్టించిన జింబాబ్వే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zimbabwe Record vs India: పసికూన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా రికార్డులో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం హరారే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా జింబాబ్వే ఖాతాలో ఈ రికార్డు చేరింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు.
ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 127 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ కాపాడుకుంది. తాజాగా కివీస్ ఆల్‌టైమ్ రికార్డును జింబాబ్వే బద్దలు కొట్టింది. పసికూన జింబాబ్వే విశ్వవిజేత అయిన టీమిండియాపై విజయం ఇంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం విశేషం. ఎన్నో ఆశలు పెట్టుకున్న యువ ప్లేయర్స్.. దారుణ ప్రదర్శన చేశారు.
Also Read
- Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
Also Read: Shankar-Rahman: భారతీయుడు-2 నుండి రెహమాన్‌ను ఎందుకు తప్పించారు?
ఉత్కంఠభరితంగా సాగిన తొలి మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 115 పరుగులు చేసింది. మడాండే (29 నాటౌట్; 25 బంతుల్లో 4×4) టాప్ స్కోరర్. రవి బిష్ణోయ్ (4-2-13-4), వాషింగ్టన్ సుందర్ (4-0-11-2) చెలరేగారు. అనంతరం రజా (3/24), చటార (3/16)ల ధాటికి యువ భారత్ 19.5 ఓవర్లలో 102 పరుగులకే ఆలౌట్ అయింది. శుభ్‌మన్ గిల్ (31; 29 బంతుల్లో 5×4), వాషింగ్టన్ సుందర్ (27; 34 బంతుల్లో 1×4, 1×6) మినహా అందరూ తేలిపోయారు.
తాజావార్తలు
-
Pakistan: పిల్లలపై అత్యాచారం, ట్రాఫికింగ్ నిందితుడు.. PoK ఎన్నికల్లో గెలుపు..
-
Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!