IND Vs ZIM: టీమిండియా సూపర్ విక్టరీ.. సిరీస్ కైవసం.. బౌలింగ్‌లో మెరిసిన కాటేరమ్మ కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జింబాబ్వేతో జరుగుతున్న మూడు T20ల సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత జట్టు 90 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించి, సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్‌లో విఫలమైనప్పటికీ, బౌలింగ్ విభాగంలో మెరిసి ఆకట్టుకోవడం ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ప్రత్యేకతగా నిలిచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల కొండంత స్కోరు సాధించింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ బ్యాట్‌తో నిరాశపరిచి కేవలం 8 పరుగులకే అవుట్ అయినప్పటికీ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ విజృంభించాడు. ఇషాన్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి భారీ స్కోరుకు బాటలు వేశాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ మరోసారి చెలరేగి ఆడాడు. తిలక్ కేవలం 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇద్దరి మెరుపు భాగస్వామ్యంతో జింబాబ్వే ముందు భారత్ కొండంత లక్ష్యాన్ని ఉంచగలిగింది.
Also Read
అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత బౌలర్లు ఆరంభం నుంచే ఒత్తిడిలోకి నెట్టారు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో మాత్రం అద్భుతం చేశాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్‌గా వచ్చి కేవలం 2.5 ఓవర్లలో 17 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నుముక విరిచాడు. అతనికి తోడుగా యష్ ఠాకూర్ 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు సాధించగా, రవి బిష్ణోయ్, శివం దూబే, తిలక్ వర్మ తలొక వికెట్ తీసుకున్నారు.
సమిష్టి బౌలింగ్ ధాటికి జింబాబ్వే జట్టు 17.5 ఓవర్లలో 129 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక ఈ సిరీస్‌లోని చివరిదైన మూడో T20 మ్యాచ్ జులై 27న హరారే వేదికగానే జరగనుంది.
తాజావార్తలు
-
Allu Arjun: చొక్కా నలగకుండా 500 కోట్లు కొట్టడం ఆయనకే సాధ్యం: ‘జైలర్ 2’పై అల్లు అర్జున్ క్రేజీ రివ్యూ!
-
Abhishek Sharma: రోహిత్ శర్మ రికార్డ్ బ్రేక్.. పవర్‌ప్లే ‘సిక్సర్ల కింగ్’గా అభిషేక్ శర్మ..!
-
Chikkadpally: యువతితో అసభ్య ప్రవర్తన.. ఘర్షణలో డీఆర్డీవో ఉద్యోగి మృతి
-
Shreyas Iyer: అతడో అద్భుతం.. నమన్ ధీర్‌పై కెప్టెన్ ప్రశంసలు..!
-
AP LocalBody Elections : తూర్పుగోదావరిలో ఎన్నికల వేడి.. రెండో రోజు భారీగా నామినేషన్లు
ట్రెండింగ్
-
Home Remedies : తెల్ల సాక్సులపై నల్ల మరకలా? ఇలా సింపుల్ చిట్కాలతో వదిలించండి
-
Harry Brook: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీతో హరీ బ్రూక్ విధ్వంసం..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!
-
Home Cleaning : దీపావళి వేళ.. ఇంట్లో బల్లులు, బొద్దింకల బెడద ఎక్కువగా ఉందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Ind vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.. 4 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు..!