Site icon NTV Telugu

IND vs WI Dream11 Prediction: భారత్-వెస్టిండీస్‌ డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

Shimron Hetmyer

Shimron Hetmyer

India vs West Indies 1st ODI Dream11 Team Prediction: 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల కోసం కరేబియన్ దీవుల్లో భారత్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 1-0తో కైసవం చేసుకున్న రోహిత్ సేన.. నేడు మూడు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్‌తో తలపడనుంది. బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా గురువారం జరిగే తొలి వన్డేలో ఆతిథ్య జట్టుతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. వన్డే సిరీస్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీకి క్వాలిఫై కాలేకపోయిన విండీస్.. ఈ సిరీస్‌లో భారత్‌పై విజయం సాధించి మళ్లీ క్రికెట్ ప్రపంచానికి తామసత్తా తెలియజేయాలనే పట్టుదలతో ఉంది.

కెన్సింగ్టన్ ఓవల్‌ వేదికగా భారత్-వెస్టిండీస్‌ తొలి వన్డే ఈరోజు జరగనుంది. రాత్రి 7 గంటలకు ఆరంభం కానుండగా.. సాయంత్రం 6.30కి టాస్ పడుతుంది. ‘జియో సినిమా’ ఈ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భారత ప్రభుత్వానికి చెందిన దూరదర్శన్ చానెల్‌లోనూ లైవ్ వస్తుంది. కెన్సింగ్‌టన్‌ ఓవల్‌ పిచ్‌ బౌలర్లు, బ్యాటర్లకు సహకరిస్తుంది. ఇక్కడ 250 లక్ష్యం చాలా కష్టం. తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Also Read: Zaheer Khan-Virat Kohli: నా కెరీర్‌ను ముగించావ్ అని కోహ్లీతో అనలేదు: హీర్‌ ఖాన్‌

తుది జట్లు (IND vs WI Playing 11):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లీ, సూర్యకుమార్‌, హార్దిక్‌, శాంసన్‌/ఇషాన్‌, జడేజా, అక్షర్‌/కుల్‌దీప్‌, శార్దూల్‌, సిరాజ్‌, ఉమ్రాన్‌ /ముకేశ్‌.
వెస్టిండీస్‌: కింగ్‌, మేయర్స్‌, కార్టీ, హోప్‌ (కెప్టెన్‌), హెట్‌మయర్‌, రోమన్‌ పావెల్‌, షెఫర్డ్‌, సింక్లయిర్‌, జోసెఫ్‌, మోటీ/కరియన్‌, సీల్స్‌.

డ్రీమ్11 టీమ్ (IND vs WI Dream11 Team):
కెప్టెన్: రోహిత్ శర్మ
వైస్ కెప్టెన్: జాసన్ హోల్డర్
వికెట్ కీపర్: ఇషాన్ కిషన్
బ్యాటర్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, క్రైగ్ బ్రాత్‌వైట్, ఇషాన్ కిషన్, హెట్‌మయర్‌
ఆల్ రౌండర్స్: జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రఖీమ్ కార్న్‌వాల్
బౌలర్లు: కెమర్ రోచ్, మహ్మద్ సిరాజ్

Also Read: Samsung Galaxy Z Fold 5, Flip 5 Price: శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్ 5, జెడ్‌ ఫ్లిప్ 5 లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Exit mobile version