IND vs WI: ఢిల్లీ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన 2వ టెస్ట్‌లో టీమిండియా వెస్టిండీస్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 5 వికెట్లు కోల్పోయి 518 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. భారత్ తోలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 175 పరుగులు, శుభమన్ గిల్ 129* చేయడంతో భారీ స్కోర్ చేసింది. వీరితోపాటు సాయి సుదర్శన్ 87, నితీష్ కుమార్ 43, ధ్రువ్ జురేల్ 44 పరుగులతో జట్టుకు సహకారం అందించారు. ఇక విండిస్ బౌలింగ్ లో జొమెల్ వారికాన్ 3 వికెట్లు పడగొట్టగా, రాస్ట్రాన్ చేజ్ 1 వికెట్ తీసాడు.
Dabirpura: పవిత్ర ఖురాన్‌ను పూర్తి చేశా అంటూ జ్యూస్ పంపిణీ.. తాగిన వారందరు మత్తులోకి..!
ఇక వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులు మాత్రమే చేయడంతో ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది. ఈ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 3, కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ తీసి భారత్ బౌలింగ్‌లో కీలక పాత్ర పోషించారు. రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 390 పరుగులు చేసి కాస్త గట్టిగానే పోరాడింది. విండీస్ రెండో ఇన్నింగ్స్ లో జాన్ క్యాంప్‌బెల్ 115, షాయ్ హోప్ 103 సెంచరీలతో భారత బౌలర్స్ ను బాగానే ప్రతిఘటించారు. ఇక భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్ 3, బుమ్రా 3, రవీంద్ర జడేజా 1 వికెట్ తీశారు.
Raja Singh: కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మీరు ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతారు?
దీనితో భారత విజయానికి టీమిండియాకు 121 పరుగుల టార్గెట్ లభించింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 121 రన్‌ల టార్గెట్‌ను 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను సులభంగా పూర్తి చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెఎల్ రాహుల్ 58*, సాయి సుదర్శన్ 39, శుభమన్ గిల్ 13, యశస్వి జైస్వాల్ 8 పరుగులు చేశారు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0తో సిరీస్ ను కైవసం చేసుకుంది.
