NTV Telugu Site icon

IND vs UAE: ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా

Ind Vs Uae

Ind Vs Uae

IND vs UAE: హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్‌లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 430 స్ట్రైక్ రేట్‌తో 43 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు స్టువర్ట్ బిన్నీ కూడా 11 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 400 స్ట్రైక్ రేట్‌తో 44 పరుగులు చేశాడు.

Read Also: IND vs NZ: ఎదురుదాడి చేస్తున్న టీమిండియా.. లంచ్ సమయానికి 195/5

టీమిండియా విజయానికి చివరి ఓవర్‌లో 32 పరుగులు కావాలి. ఈ సమయంలో బిన్నీ 4 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టాడు. అయితే, అదృష్టం చివరి బంతికి టీమిండియా వైపు అనుకూలంగా లేదు. చివరి బంతికి బిన్నీ రనౌట్ కావడంతో టీమిండియా 1 పరుగుతో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇక యూఏఈ తరఫున ఖలీద్ ఖాన్, జహూర్ ఖాన్ లు బ్యాట్ తో రెచ్చిపోయారు. ఓపెనర్ ఖలీద్ 10 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సర్ల సాయంతో 42 పరుగులు చేయగా.. జహూర్ ఖాన్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌ల ఆధారంగా టీమిండియా జరిగిన మ్యాచ్‌లో యూఏఈ 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. స్టువర్ట్ బిన్నీ 2 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

Show comments