NTV Telugu Site icon

IND vs SL: ఓటమి నుండి టీమిండియా కోలుకుంటుందా.? ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..

Ind Vs Sl 3 Odi

Ind Vs Sl 3 Odi

IND vs SL 3 ODI : టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య మూడవ, చివరి వన్డే ఆగస్టు 7న కొలంబోలో జరగనుంది. ఇకపోతే రెండో వన్డేలో టీమిండియా పై శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆతిథ్య జట్టుకు సిరీస్ గెలిచే గొప్ప అవకాశం వచ్చింది. మరోవైపు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు సిరీస్‌ను డ్రాగా ముగించాలని భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య జరిగిన పోరులో భారత జట్టుదే పైచేయి. ఇప్పటి వరకు ఇరు జట్లు మొత్తం 170 వన్డేల్లో తలపడగా.. అందులో భారత్ 99 మ్యాచ్లు, శ్రీలంక 58 మ్యాచ్లు గెలిచాయి. కాగా 2 మ్యాచ్‌లు టై కాగా, 11 మ్యాచ్‌లు ఎటువంటి ఫలితాన్ని పొందలేదు. శ్రీలంక గడ్డపై భారత్ 5 సిరీస్‌లు గెలుచుకోగా, 2 సిరీస్ లను ఓడిపోయింది.

ఇకపోతే ప్రస్తుత సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో కెప్టెన్ రోహిత్ శర్మ మినహించి మిగితా భారత బ్యాట్స్‌మెన్లు నిరాశపరిచారు. రెండో వన్డేలో లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు కేవలం 208 పరుగులకే కుప్పకూలింది. ఇకపోతే చివరి వన్డేలో శివమ్ దూబే స్థానంలో రియాన్ పరాగ్‌కు అవకాశం లభించకపోలేదు. ఇక ప్రాబబుల్ XI లో రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ లు ఉండవచ్చు.

ఇకపోతే శ్రీలంక బౌలర్లు ఇప్పటి వరకు అద్భుతాలు చేశారు. రెండో వన్డేలో శ్రీలంక స్పిన్నర్లు ఏకంగా 9 వికెట్లు తీశారు. కొలంబో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై జెఫ్రీ వాండర్ మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌కు సమస్యలు సృష్టించాలనుకుంటున్నాడు. రెండో వన్డేలో వాండర్సే 6 వికెట్లు పడగొట్టి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ నేపథ్యంలో మరోసారి ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ 2 వన్డేల్లో 61.00 సగటుతో మొత్తం 122 పరుగులు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక శ్రీలంకలో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వెలలాగే మంచి ప్రదర్శన చేశాడు. అతను 2 ఇన్నింగ్స్‌లలో 106.00 స్ట్రైక్ రేట్‌తో 106 పరుగులు చేశాడు. ఆగస్టు 7న ప్రేమదాస ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో శ్రీలంక, భారత్ మధ్య మూడో ODI మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లైవ్ యాప్‌లో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.