IND vs SA: భారత్ పర్యటనకు సిద్ధమవుతున్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టు తమ 15 మంది టెస్టు జట్టును అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 14 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో సఫారీలు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో టీమిండియాను ఎదుర్కోనున్నారు. ఈ సుదీర్ఘ సిరీస్ సుమారు నెల రోజులపాటు జరగనుంది. గాయం కారణంగా ఇటీవల పాకిస్థాన్ సిరీస్‌కు దూరమైన కెప్టెన్ బావుమా ఈసారి తిరిగి జట్టులోకి చేరి నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆయన రీ-ఎంట్రీతో సఫారీ జట్టు మరింత బలంగా కనపడుతుంది. పాక్ సిరీస్‌లో ఆడిన ప్రధాన ఆటగాళ్లలో చాలా మందికి ఈ టెస్టు జట్టులో చోటు దక్కింది.
సఫారీ జట్టు నవంబర్ 14న ప్రారంభమయ్యే మొదటి టెస్టుతో తమ పర్యటనను ఆరంభిస్తుంది. మొదటి టెస్టు నవంబర్ 14 నుంచి 18 వరకు కోల్‌కతాలో, రెండో టెస్టు నవంబర్ 22 నుంచి 26 వరకు గువాహటిలో జరగనుంది. ఇక ఆ తర్వాత మూడు వన్డే మ్యాచ్‌లు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 6 వరకు జరుగుతాయి. ఇవి రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నం వేదికలుగా జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే ఐదు టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి 19 వరకు కొనసాగుతుంది. వీటికి కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లఖ్‌నవూ, అహ్మదాబాద్ వేదికలు ఎంపికయ్యాయి.
Dhanya Balakrishna : అలాంటి సీన్లు చేయకపోతే కెరీర్ ఉండదు.. హీరోయిన్ కామెంట్స్
సౌతాఫ్రికా టెస్టు జట్టు:
తెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హర్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్‌క్రమ్, వియాన్ ముల్డర్, సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ, ర్యాన్ రికెల్‌టన్, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెరినె ఆటగాళ్లు జట్టులో ఉన్నారు.
