NTV Telugu Site icon

Rohit Sharma: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma bags Test duck for the first time since 2015: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన రెండో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ రికార్డుల్లో నిలిచాడు. సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరగడంతో హిట్‌మ్యాన్‌ ఈ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పేసర్ కాగిసో రబాడ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ను రబాడ ఔట్‌ చేయడం ఇది 14వ సారి కావడం గమనార్హం.

దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన మొదటి భారత కెప్టెన్‌గా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ ఉన్నాడు. 2011 దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మహీ డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ కూడా ఈ జాబితాలోకి చేరాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ దారుణ ప్రదర్శరన చేశాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోయిన రోహిత్ సేన మూల్యం చెల్లించుకుంది.

Also Read: Cocaine : హెయిర్ కండీషనర్, బాడీ వాష్ బాటిళ్లలో రూ.15 కోట్ల విలువైన కొకైన్.. మహిళా స్మగ్లర్ అరెస్ట్

ఇక టెస్ట్ క్రికెట్‌లో భారత్ ఓ చెత్త రికార్డ్ నమోదు చేసింది. దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తవడంతో సఫారీ గడ్డపై అత్యంత భారీ పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. 13 ఏళ్ల తర్వాత టీమిండియాకు ఈ ఘోర పరాజయం ఎదురైంది. 2010లో ఇన్నింగ్స్ 25 రన్స్ తేడాతో ఓడిన భారత్.. ఆ చెత్త రికార్డ్‌ను తాజాగా అధిగమించింది.

Show comments