Site icon NTV Telugu

Ind vs Aus: దుమ్ము దులిపిన టీమిండియా బ్యాటర్లు.. దక్షిణాఫ్రికాకు భారీ టార్గెట్..!

Ind Vs Aus

Ind Vs Aus

Ind vs Aus: నవి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా భారత జట్టు నిర్ణిత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత ఓపెనర్లు స్మృతి మంధనా, షఫాలి వర్మ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి మంధానా 45 పరుగులు (58 బంతుల్లో 8 ఫోర్లు) చేసి అవుట్ కాగా, మరో ఎండ్‌లో షఫాలి వర్మ తన దూకుడు బ్యాటింగ్‌తో అదరగొట్టింది. షఫాలి 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో తనదైన దూకుడుతో ప్రతీ బౌలర్‌పై ఆధిపత్యం చూపిస్తూ ఫైనల్ వేదికను అలరించింది.

Andhra Pradesh : అడల్ట్‌రేటెడ్‌ లిక్కర్ కేసులో వైసీపీ నేత జోగి రమేష్ అరెస్ట్

ఇక షఫాలి ఔటైన తర్వాత జెమిమా రోడ్రిగ్స్ (24), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (20) కాస్త స్థిరంగా ఆడినా పెద్ద స్కోరు సాధించలేకపోయారు. అయితే దీప్తి శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడింది. ఆమె 58 పరుగులతో అద్భుతంగా రాణించి ఇన్నింగ్స్ చివరి దశల్లో వేగాన్ని పెంచింది. ఇక వికెట్ కీపర్ రిచా ఘోష్ చివర్లో 34 పరుగులతో వేగంగా ఆడటంతో స్కోరు 300 దాటే స్థాయికి చేరింది. కానీ చివరగా భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 298 పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో అయాబోంగా ఖాకా 3 వికెట్లు తీసింది. నాన్‌కులులేకో మ్లాబా (1/47), నడైన్ డే క్లార్క్ (1/52), క్లో ట్రయాన్ (1/46) ఒక్కొక్క వికెట్ తీశారు.

Botsa Satyanarayana: కాశీబుగ్గ బాధితులకు వైఎస్సార్సీపీ పార్టీ తరపున రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా..?

Exit mobile version