NTV Telugu Site icon

IND vs SA: మొహ్మద్ ష‌మీ స్థానంలో అవేశ్ ఖాన్‌!

Avesh Khan

Avesh Khan

Avesh Khan replaces Mohammed Shami in India squad for IND vs SA 2nd Test: జనవరి 3 నుంచి కేప్‌టౌన్‌లో ద‌క్షిణాఫ్రికాతో జరగనున్న రెండో టెస్టుకు భార‌త జ‌ట్టులో బీసీసీఐ మార్పు చేసింది. సీనియర్ పేస్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ స్థానంలో అవేశ్ ఖాన్‌ను తీసుకుంది. తొలి టెస్టులో ష‌మీ ఆడ‌లేదు. అయితే ముందుగా రెండో టెస్టుకు అత‌న్ని ఎంపిక చేశారు. అయితే చీలమండ గాయం కారణంగా షమీ ఇంకా జ‌ట్టుతో క‌ల‌వ‌లేదు. దీంతో షమీ స్థానంలో అవేశ్ ఖాన్‌కు బీసీసీఐ చోటు కల్పించింది.

మొహ్మద్ షమీని దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేశారు. అయితే సిరీస్ ప్రారంభమయ్యే సమయానికి అతడు ఫిట్‌నెస్‌ను నిరూపించుకోలేకపోయాడు. పూర్తి ఫిట్‌నెస్‌ కోసం బీసీసీఐ ఎదురుచూడడంతో.. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టుకు షమీ దూరమయ్యాడు. ఫిట్‌నెస్‌ లేకపోవడంతో రెండో టెస్టుకు కూడా అతడు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో అవేశ్‌ ఖాన్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. అవేష్ ఇప్పటివరకు 38 ఫస్ట్‌క్లాస్ గేమ్‌లలో 22.65 సగటుతో 149 వికెట్లు తీశాడు. టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆడాడు.

Also Read: Devil Movie Review: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ మూవీ రివ్యూ!

రెండో టెస్టు కోసం భార‌త జట్టు ఇదే:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ‌మ‌న్ గిల్‌, యశస్వి జైస్వాల్‌, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్య‌ర్, కేఎల్ రాహుల్, ఆర్ అశ్విన్‌, రవీంద్ర జ‌డేజా, శార్దూల్‌ ఠాకూర్, మొహ్మద్ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ప్ర‌సిద్ధ కృష్ణ‌, కేఎస్ భ‌ర‌త్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, అవేశ్ ఖాన్.

Show comments