Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Pak U19 Super Six Clash Today High Voltage Match With Semi Final Spot At Stake

IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!

Published Date :February 1, 2026 , 10:24 am
By Kothuru Ram Kumar
IND vs PAK U19: సూపర్ సిక్స్‌లో హై వోల్టేజ్ పోరు.. నేడే దాయాదుల పోరు.. వర్షం పడే అవకాశం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs PAK U19: అండర్ 19 ప్రపంచకప్ 2026లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. టోర్నమెంట్‌లోని 36వ మ్యాచ్‌లో భారత్ అండర్–19 జట్టు, పాకిస్తాన్ అండర్–19 జట్టుతో తలపడనుంది. సూపర్ సిక్స్ దశలో భాగంగా ఈ మ్యాచ్ ఫిబ్రవరి 1న జింబాబ్వేలోని బులవాయోలో ఉన్న క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. సూపర్ సిక్స్ గ్రూప్–2లో భారత్, పాకిస్తాన్ రెండూ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ మూడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో పట్టికలో రెండో స్థానంలో ఉండగా, పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

Union Budget 2026: క్యాపెక్స్, అప్పులు, పన్నులు.. బడ్జెట్‌లో మనం గమనించాల్సిన కీలక పాయింట్స్ ఇవే..

ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్‌లను పరిశీలిస్తే.. పాకిస్తాన్ నాలుగు సార్లు విజయం సాధించింది. భారత్ కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్‌లో గత పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం కానుంది. ఈ మ్యాచ్‌ లో విజయం సాధించిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీఫైనల్‌కు చేరడంతో, భారత్ లేదా పాకిస్తాన్‌లో ఒక్క జట్టుకే చివరి నాలుగులో స్థానం దక్కనుంది. దీంతో ఈ మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.

ఇటీవల జరిగిన అండర్–19 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ తలపడగా.. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రపంచకప్ వేదికగా అదే ప్రత్యర్థిపై గెలిచి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్లో అందుబాటులో ఉంటుంది. అయితే నేడు బులవాయోలో వర్షం పడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. రోజంతా ఎండమావులు కనిపించే అవకాశం ఉండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 25 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండనున్నాయి. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండనుంది.

Sanju Samson: సంజూ శాంసన్ కెరీర్‌ ముగిసినట్లేనా?.. ఇక ఐపీఎల్‌లో ఆడుకోవాల్సిందేనా?

భారత్ U19 జట్టు:
ఆయుష్ మ్హాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుందు (వికెట్ కీపర్), కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్, కిషన్ కుమార్ సింగ్, హెనిల్ పటేల్, ఉదవ్ మోహన్, ఆర్.ఎస్. అంబ్రిష్, మొహమ్మద్ ఎనాన్, హర్వంశ్ పాంగలియా.

పాకిస్తాన్ U19 జట్టు:
హమ్జా జహూర్, సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్), అహ్మద్ హుస్సేన్, హుజైఫా అహ్సన్, అబ్దుల్ ఖాదిర్, అబ్దుల్ సుభాన్, మొమిన్ ఖమర్, మొహమ్మద్ సయ్యామ్, అలీ రజా, ఉమర్ జైబ్, అలీ హసన్ బలోచ్, దానియాల్ అలీ ఖాన్, నికాబ్ షఫీక్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bulawayo weather U19 match
  • ICC U19 World Cup 2026
  • IND vs PAK live streaming
  • IND vs PAK U19
  • india u19 match today

తాజావార్తలు

  • SS Rajamouli : రాజమౌళి రాముడొస్తే ఇలా ఉండదు.. రణ్‌బీర్ ‘రామాయణ’ vs రాజమౌళి’వారణాసి’

  • CM Revanth Reddy: మా రాష్ట్రంకి వచ్చి చూడండి.. పినరయ్ విజయన్‌కు సీఎం రేవంత్ సవాల్!

  • Vijay Devarakonda : రణబాలి ఫైట్ సీన్ లీక్.. దేవరకొండ విశ్వరూపం!

  • Amit shah: 15 రోజులు బెంగాల్లోనే ఉంటా.. మమత సర్కార్‌ను గద్దె దించుతామని సవాల్

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions