Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. బలమైన జట్టుతో ఆడుతున్నప్పుడు మ్యాచ్‌లు చివరి వరకు ఇలాగే ఉత్కంఠగా సాగుతాయని, మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్, బెవాన్ జాకోబ్స్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయినా అద్భుతంగా ఆడి జట్టును 180 పరుగుల గౌరవప్రదమైన స్కోరుకు చేర్చారని తెలిపారు. మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్ మైదానం వీడటం గురించి మాట్లాడుతూ.. ఇది కేవలం ముందస్తు జాగ్రత్త మాత్రమేనని, సిరీస్‌లో త్వరగా జరిగే మ్యాచ్‌ల కారణంగా రొటేషన్ అవసరమని పేర్కొన్నారు.
భారత బ్యాటింగ్ గురించి స్పందిస్తూ.. తిలక్ వర్మ, నమన్ ధీర్, చివర్లో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా ఆడి తమ కొంపముంచారని సాంట్నర్ వాపోయారు. తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి భాగస్వామ్యాన్ని విడదీసి ఉంటే మ్యాచ్ తమ చేతుల్లోకి వచ్చేదని, తాము గెలిచాం అనుకునే లోపే అంతా మారిపోయిందని అభిప్రాయపడ్డారు.
Also Read
ఛేజింగ్‌ను వారు హ్యాండిల్ చేసిన తీరు తమను ఒత్తిడికి గురిచేసిందని, దాంతో చివర్లో కొన్ని పొరపాట్లు చేయాల్సి వచ్చిందని తెలిపారు. మా బౌలర్లు అద్భుతంగా ప్రారంభించినప్పటికీ, నో-బాల్‌కు వికెట్ పడటం వంటి చిన్న చిన్న ఫీల్డింగ్ తప్పిదాలు తమ విజయవకాశాలను దెబ్బతీశాయని, నైపుణ్యాల పరంగా బాగానే ఆడినా కీలక సమయాల్లో చేసిన పొరపాట్లే ఓటమికి కారణమయ్యాయని సాంట్నర్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!