NTV Telugu Site icon

IND vs NZ: వన్డే ప్రపంచకప్ ఆడతానని 2011లోనే నా స్నేహితులకు చెప్పా!

Untitled Design (3)

Untitled Design (3)

Shreyas Iyer Says I told my friends that I will also play a World Cup one day: తాను కూడా ఒక రోజు వన్డే ప్రపంచకప్ ఆడతానని తన స్నేహితులకు 2011లోనే చెప్పానని టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. తాను నార్త్ స్టాండ్‌లో కూర్చుని 2011 వన్డే ప్రపంచకప్ చూశానని, ఇప్పుడు మైదానంలో ఆడడానని చెప్పాడు. సొంత అభిమానుల మధ్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సరదాగా ఉందని శ్రేయస్ పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ అయ్యర్ 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లతో 105 రన్స్ చేశాడు.

మ్యాచ్ అనంతరం శ్రేయస్‌ అయ్యర్ మాట్లాడుతూ… ‘2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌ను ఇదే వాంఖడే స్టేడియంలో నేను నార్త్ స్టాండ్‌లో కూర్చుని చూశా. మైదానంలో అభిమానులు వందేమాతరం అని అన్నప్పుడల్లా, సాంగ్ వచ్చినపుడల్లా నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. నేను కూడా ఒక రోజు వన్డే ప్రపంచకప్ ఆడతానని నా స్నేహితులకు చెప్పాను. నా కల నిజమైంది. చాలా సంతోషంగా ఉంది. సొంత అభిమానుల మధ్య ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం ఎంతో సరదాగా ఉంది. ఫైనల్ చేరడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. భారత్ ఆటగాళ్లు అందరూ బాగా ఆడుతున్నారు. ట్రోఫీ గెలుస్తామనే నమ్మకం ఉంది’ అని ధీమా వ్యక్తం చేశాడు.

Also Read: Virat Kohli-Anushka Sharma: అనుష్క ఏం చేస్తుందబ్బా.. స్టేడియంలో విరాట్ కోహ్లీ వెతుకులాట!

‘కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడాడు. అదే మాకు కలిసొచ్చింది. రోహిత్ ఇచ్చిన శుభారంభాన్ని మేం కొనసాగయించాం. రోహిత్ ఫియర్‌లెస్ కెప్టెన్. అందుకే మిగిలిన వారిలోనూ అదే దూకుడు కనిపిస్తుంది. మేనేజ్‌మెంట్ కూడా ఎంతో మద్దతుగా నిలుస్తోంది. మెగా టోర్నీ ప్రారంభంలో నేను బాగా ఆడలేకపోయా. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని కెప్టెన్, మేనేజ్మెంట్ చెప్పింది. బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టమన్నారు. ఒత్తిడి సమయంలోనూ ఎలా ఆడాలో తీవ్రంగా శ్రమించా. నెట్స్‌లోనూ పేస్‌ బౌలింగ్‌తో పాటు స్పిన్నర్లను ఎదుర్కొంటూ సాధన చేశా. కొత్త బంతితో జస్ప్రీత్ బుమ్రాను అడ్డుకోవడం చాలా కష్టం. అందుకే నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లోనూ ఎక్కువగా ప్రాక్టీస్‌ చేశా. ఇదే రాణించడానికి సాయపడుతోంది’ అని శ్రేయస్‌ అయ్యర్ తెలిపాడు.

 

Show comments