IND vs NZ 2nd Test: లంచ్ బ్రేక్.. న్యూజిలాండ్ స్కోర్ 92/2!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూణే వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మొదటి రోజులో తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి కివీస్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్లు డేవాన్ కాన్వే (47), రచిన్ రవీంద్ర (5) క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ టామ్ లాథమ్ (15), విల్ యంగ్ (18)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ ఇద్దరినీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేశాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 32 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. టామ్ లాథమ్‌ను ఔట్ చేసిన అశ్విన్.. భారత్‌కు తొలి వికెట్ అందించాడు. యాష్ అద్భుతమైన బంతికి కివీస్ కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. డేవాన్ కాన్వేతో కలిసి విల్ యంగ్ ఇన్నింగ్స్‌ను నడిపించేందుకు ప్రయత్నించాడు. అయితే అశ్విన్ బౌలింగ్‌లో కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. లెగ్‌సైడ్ వేసిన బంతిని ఆడే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని.. పంత్ చేతుల్లో పడింది. భారత ఫీల్డర్లు అప్పీలు చేసినా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. డీఆర్‌ఎస్ తీసుకోమని కెప్టెన్ రోహిత్ శర్మను సర్ఫరాజ్ ఖాన్ కోరాడు.రోహిత్ సమీక్షకు వెళ్లగా.. రిప్లేలో ఔట్ అని తేలింది.
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
Also Read: Tecno Pova 6 Neo: ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ ఆఫర్.. 12 వేలకే ‘టెక్నో పోవా 6 నియో’!
డేవాన్ కాన్వేకు రచిన్ రవీంద్ర జత కలిశాడు. కాన్వే ఎక్కువగా స్ట్రైక్ తీసుకుని పరుగులు చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మొదటి టెస్టులో సెంచరీ చేసిన రవీంద్ర.. ఇప్పటికే కుదురుకున్నాడు. ఈ ఇద్దరిని అవుట్ చేస్తే కానీ.. కివీస్ భారీ చేయకుండా అడ్డుకట్ట వేయొచ్చు. రెండో సెషన్లో భారత బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. ఈ టెస్ట్ గెలవడం టీమిండియాకు అత్యంత కీలకం అన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!