Ind vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ 2026లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తొలి వన్డేలో విజయం సాధించి 1-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా బుధవారం (జనవరి 14) రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగే రెండో వన్డేలో సిరీస్‌ను గెలుచుకునేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు జట్టులో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తొలి వన్డేలో వాషింగ్టన్ సుందర్ గాయంతో సిరీస్‌కు దూరం కావడం టీమిండియాకు ఎదురుదెబ్బగా మారింది. అంతేకాదు తొలి మ్యాచ్‌కు ముందు రిషభ్ పంత్ గాయపడటంతో అతడిని కూడా జట్టు కోల్పోయింది. ఈ నేపథ్యంలో సెలెక్టర్లు ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీని జట్టులోకి ఎంపిక చేశారు. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహానికి అనుగుణంగా ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడే నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశమివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
Fire Accident: గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రాణాపాయం
వడోదరలో జరిగిన తొలి వన్డేలో భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. చేజ్‌లో విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చూపించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే సెంచరీకి కేవలం 7 పరుగుల దూరంలో ఔటయ్యాడు. కోహ్లీ అవుట్ అయిన తర్వాత భారత్ కాస్త ఒత్తిడిలో పడినప్పటికీ, కేఎల్ రాహుల్ మరోసారి ఫినిషర్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
ఈ రెండో వన్డే మ్యాచ్ నేడు (బుధవారం) మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉండగా, జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ మధ్య 121 వన్డేలు జరగగా, భారత్ 63 మ్యాచ్‌లు గెలవగా.. న్యూజిలాండ్ 50 విజయాలు సాధించింది. 7 మ్యాచ్‌లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది.
GG W vs MI W: హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీతో ముంబై ఘన విజయం.. గుజరాత్‌కు తొలి ఓటమి..!
అంచనా జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
న్యూజిలాండ్: విల్ యంగ్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే (వికెట్‌కీపర్), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), క్రిస్టియన్ క్లార్క్, జకరీ ఫౌల్క్స్, కైల్ జేమీసన్, ఆదిత్య అశోక్.
