NTV Telugu Site icon

IND vs NZ: భారత్- న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మార్పులు!

Bengaluru Test

Bengaluru Test

IND vs NZ 1st Test Session Timings: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. బెంగళూరులో భారీ వర్షం కురవడంతో తొలి రోజైన బుధవారం ఆట సాధ్యపడలేదు. కనీసం టాస్‌ వేయడానికి కూడా అవకాశం లేకపోయింది. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రోజైనా ఆట మొదలవుతుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆక్యూ వెదర్‌ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బెంగళూరులో వర్షం కురవడం లేదు. అయితే 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మధ్యాహ్నం 1 తర్వాత వర్షం తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. వర్షం పడినా మైదానాన్ని సిద్ధం చేసేందుకు బెస్ట్ సబ్‌ ఎయిర్‌సిస్టమ్ ఉండడం ఊరట కలిగించే అంశం. చిన్నస్వామి స్టేడియంలో వర్షం ఆగాక గంటలో మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

Also Read: Nayab Singh Saini: నేడు హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం!

ఈ టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఉదయం 8.45కే టాస్‌ వేసి.. 9.15కి ఆటను ఆరంభించాలని అంపైర్లు నిర్ణయించారు. రోజు మొత్తం మ్యాచ్‌ జరిగితే 98 ఓవర్ల ఆటను నిర్వహించనున్నారు. ఇందుకోసం సమయాల్లో మార్పులు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్‌ 9.15 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ 12.10 నుంచి మధ్యాహ్నం 2.25 గంటల వరకు, చివరి సెషన్ 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు జరుగుతుంది.