NTV Telugu Site icon

T20 World Cup 2024: తస్మాత్ జాగ్రత్త.. ఆటగాళ్లను హెచ్చరించిన రాహుల్ ద్రవిడ్!

Rahul Dravid On New York Stadium

Rahul Dravid On New York Stadium

Team India Coach Rahul Dravid on New York Stadium: యూఎస్, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2024 ఆరంభం అయింది. లీగ్‌ స్టేజ్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో జరగనుంది. జూన్ 9న పాకిస్తాన్, 12న అమెరికాతో మ్యాచ్‌లు కూడా ఇదే మైదానంలో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ కూడా నాసౌవ్‌లోనే జరిగింది. అయితే ఈ మైదానంలో ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు. భారత జట్టు ప్రస్తుతం నాసౌవ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!

‘నాసౌవ్‌ కౌంటీ స్టేడియం చాలా సాఫ్ట్‌గా ఉంది. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు ప్లేయర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై ఆటగాళ్లు దృష్టి సారించాలి. మైదానం స్పాంజీలా అనిపించింది. మైదానం కింద ఎక్కువగా ఇసుకతో నింపినట్లు ఉంది. రిథమ్‌ను అందుకోవడంపై శ్రమించాలి. వార్మప్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు రాణించారు. బౌలింగ్‌లోనూ ఆధిపత్యం ప్రదర్శించారు. పిచ్‌ ఎలా ఉందనే దానిపై మాకు ఓ అవగాహన వచ్చింది. వార్మప్‌ మ్యాచ్‌ను చూసేందుకూ అభిమానులు రావడం సంతోషంగా అనిపించింది’ అని రాహుల్ ద్రవిడ్ తెలిపాడు.

Show comments