IND vs ENG: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉంది.. మాజీ ఆటగాడు వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zaheer Khan on Team India Batting: భారత్ బ్యాటింగ్ బాగా మెరుగుపడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ సత్తా చాటడం వల్లే జట్టు గెలిచిందని.. మిగతా టెస్టుల్లో సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్‌పై రెండో టెస్టులో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. హైదరాబాద్‌లో ఎదురైన పరాభవానికి రోహిత్ సేన విశాఖలో బదులు తీర్చుకుంది. ఇక మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరంభం కానుంది.
బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యం ప్రస్తుతం టీమిండియాకు అతిపెద్ద సమస్యగా కనిపిస్తోందని జహీర్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశాడు. జియో సినిమా షోలో రెండో టెస్టులో భారత బ్యాటర్ల ఆట తీరును జహీర్ విశ్లేషించాడు. ‘సిరీస్‌లో ఒక మ్యాచ్ ఓడి వెనుకంజలో ఉన్నపుడు.. 1-1తో సమం చేయాలనే కసి, దూకుడు ఆటగాళ్లలో కనిపించాలి. ప్రతి ఒక్క ఆటగాడి నుంచి ఉత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రోహిత్ శర్మ కృషి చేశాడు. అయితే మన బ్యాటింగ్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. ఇలాంటి పిచ్‌ల మీద భారత బ్యాటర్లు ఇంతకంటే గొప్పగా బ్యాటింగ్ చేశారు. నిజానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసింది’ అని జహీర్ అన్నాడు.
Also Read
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
Also Read: Sebastian Pinera Dead: హెలికాప్టర్ ప్రమాదం.. చిలీ మాజీ అధ్యక్షుడు మృతి!
‘భారత జట్టు బ్యాటింగ్ ఆందోళన కలిగిస్తోంది. విశాఖ పిచ్‌పై భారత బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను చూస్తే.. ఒకే అర్ధ సెంచరీ నమోదైంది. అయినా 300కు దగ్గరగా స్కోరు చేసింది. సమష్టిగా ఆడడమే ఇందుకు కారణం. భారత్ తరఫున యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ రాణించారు. కానీ మిగతా బ్యాటర్లు మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. రెండో టెస్టులో జైస్వాల్ డబుల్ సెంచరీ (209) చేయగా.. గిల్ సెంచరీ (104) చేశాడు.
తాజావార్తలు
-
Rajini – Kamal Movie Update: రజినీ – కమల్ మూవీకి షూటింగ్ అప్డేట్… మరో మూడేళ్లు తలైవా బిజీ బిజీ!
-
Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ మూడు రాశుల వారికి నేడు పండగే!
-
Tollywood : చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!