NTV Telugu Site icon

IND vs ENG: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. రోహిత్ శర్మ సేఫ్! తుది జట్లు ఇవే

India Vs England

India Vs England

India vs England Playing 11 Out: వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జొస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని బట్లర్ తెలిపాడు. మరోవైపు భారత్ కూడా న్యూజీలాండ్‌తో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. భారత్ ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే భారత్ సెమీస్ బెర్ట్ ఖరారు అవుతుంది.

ఈ మ్యాచ్‌కు ముందు భారత్ క్రికెట్ అభిమానులకు ఓ షాకింగ్‌ న్యూస్‌ తెలిసిన విషయం తెలిసిందే. భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమవుతున్నట్లు వార్తలు వచ్చాయి. శనివారం ప్రాక్టీస్‌ సందర్భంగా రోహిత్ స్వల్పంగా గాయపడ్డాడని, ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకుంటాడని కథనాలు వచ్చాయి. అయితే రోహిత్ నేడు బరిలోకి దిగడంతో అన్ని అనుమానాలకు చెక్ పడింది. టాస్ సందర్భంగా రోహిత్‌ను మైదానంలో చూసిన ఫాన్స్ కేకలు వేశారు. ‘రోహిత్ శర్మ సేఫ్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

తుది జట్లు:
భారత్‌: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్‌ సిరాజ్‌.
ఇంగ్లండ్‌: డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్, లివింగ్‌స్టోన్‌, మొయిన్ అలీ, క్రిస్‌ వోక్స్‌, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Show comments