Site icon NTV Telugu

KL Rahul: దేశానికే తొలి ప్రాధాన్యం.. కేఎల్‌ రాహుల్‌ సూపర్!

Kl Rahul Test

Kl Rahul Test

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ హేమంగ్‌ బదానీ ప్రశంసలు కురిపించాడు. రాహుల్ తన వ్యక్తిగత జీవితం కన్నా.. క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడని కొనియాడాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో ఓ సీనియర్‌ బ్యాటర్‌గా రాహుల్‌ తన పాత్ర పోషించాడన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ కంటే ముందు తాను సన్నాహక మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నానని రాహుల్ తనతో చెప్పాడని బదానీ తెలిపారు. రాహుల్ లీడ్స్‌ టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 137 రన్స్‌ చేసిన విషయం తెలిసిందే.

Also Read: IND vs ENG: బుమ్రాకు కాస్త మద్దతు ఇయ్యండయ్యా!

హేమంగ్‌ బదానీ మాట్లాడుతూ… ‘ఇంగ్లండ్‌కు బయలుదేరే ముందు కేఎల్ రాహుల్ నాతో మాట్లాడాడు. నేను ఇంగ్లండ్‌కు భారత జట్టు కంటే ముందుగా వెళ్లాలనుకుంటున్నా. టెస్ట్‌ సిరీస్ కంటే ముందు సన్నాహక మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా. నాకు వ్యక్తిగత జీవితం కంటే.. దేశమే ముఖ్యం అని రాహుల్‌ నాతో చెప్పాడు. రాహుల్‌ అలా చెప్పడం నిజంగా గ్రేట్‌. మొదటి టెస్టులో ఓ సీనియర్‌ బ్యాటర్‌గా అతడు తన పాత్ర పోషించాడు’ అని తెలిపాడు. గత మార్చిలో రాహుల్ సతీమణి అతియా శెట్టి మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ నేపథ్యంలో కుటుంబంతో సమయం గడపడాని కంటే.. భారత జట్టుకు ఆడటానికే ప్రాధాన్యం ఇచ్చాడు.

Exit mobile version